Tue. Jan 20th, 2026

    Keerthy Suresh: సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. అయితే తాజాగా తమిళనాట నటి కీర్తి సురేష్‌ రాజకీయ ప్రవేశంపై వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి, తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, “మహానటి” చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

    ఇటీవలే తన 15 ఏళ్ల స్నేహితుడిని వివాహం చేసుకున్న కీర్తికి, పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు కాస్త తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన “ఉప్పు కారం” ఓటీటీలో విడుదలైంది. కొత్త సినిమాల ప్రకటన చేయని కీర్తి ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్‌లో మాత్రం యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

    ఇదిలా ఉండగా, కీర్తి సురేష్‌ ఇటీవల మదురైలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ ఆమెను చూసిన అభిమానులు “టీవీకే.. టీవీకే” అంటూ నినాదాలు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. కారణం.. ఆమె గతంలో నటుడు విజయ్‌తో కలిసి రెండు చిత్రాల్లో నటించడమే కాదు, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో ఆమె చేరబోతున్నారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే.

    keerthy-suresh-into-politics
    keerthy-suresh-into-politics

    Keerthy Suresh: ఇప్పటి వరకు కీర్తి సురేష్ నుంచి అధికారిక స్పందన రాలేదు.

    ఈ వార్తలపై ఇప్పటి వరకు కీర్తి సురేష్ నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే రాజకీయాలపై ఆమెకు ఆసక్తి ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఆమె పెద్ద ఎత్తున అభిమానులను కలిగి ఉండటంతో విజయ్ పార్టీకి ఆమె చేరిక ద్వారా మరింత బలంపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇంతకీ కీర్తి సురేష్ నిజంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? లేక అభిమానుల ఊహాగానాలకే ఇది పరిమితమా? అన్నది త్వరలోనే తెలుస్తుందన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు అభిమానుల మధ్య నడుస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.