Keerthi Suresh : కొంటె చూపులతో సైగలు చేస్తూ కవ్విస్తున్న దసరా బుల్లెమ్మ

Keerthi Suresh : తొలి సినిమా తోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని తెలుగు తెర ముందు మ్యాజిక్ చేసింది కీర్తి సురేష్. నేను శైలజ అంటూ గుర్రాలను పలకరించి తన అందంతో అభినయంతో అందరి హృదయాలను గెలుచుకుంది.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree

నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తనలోని మహానటిని మేల్కొల్పింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్ లో పెరిగిపోయింది. సావిత్రి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది అంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ ఈ మధ్య గత కొంతకాలంగా అమ్మడి ఖాతాలో ఫ్లాపులు పెరిగాయి.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree

మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కీర్తి సీన్ అయిపోయింది అంటూ చాలామంది అనుకున్నారు కానీ, అంతే స్పీడ్ గా కం బ్యాక్ ఇచ్చేందుకు ఈ బ్యూటీ ఫుల్ మాస్ గెటప్ తో తెర ముందు కనిపించబోతోంది. డి గ్లామర్ రోల్ పోషిస్తూ తనలోని మహానటిని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దసరా సినిమాతో దుమ్ము దులపడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree

ఓవైపు నానితో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ రచ్చ రచ్చ చేస్తున్న కీర్తి సురేష్ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ స్టైల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉండే స్టైల్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. తాజాగా క్రీమ్ కలర్ చీర కట్టుకుని బోల్డ్ లుక్స్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది కీర్తి సురేష్.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree

తాజా ఫోటోషూట్ కోసం కీర్తి సురేష్ క్రీమ్ కలర్ శారీని ఎన్నుకుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న దసరా మూవీ ప్రమోషన్ లో భాగంగా శారీ లుక్ తో అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. చీర కట్టులో కీర్తి ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని ఉల్లి పొరలాంటి ఒంటి రంగులో కలిసిపోయే చీరను కట్టుకొని కుర్రాళ్ళను ఉర్రూతలూగిస్తోంది.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree

చీరకు తగ్గట్లుగా చెవులకు భారీ ముత్యాల ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని మైమరిచేలా చేస్తుంది. కురులతో అందమైన కొప్పులు చుట్టుకొని తలలో గులాబీ పూలు పెట్టుకొని కొంటె చూపుతో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

keerthi-suresh-gorgeous-looks-in-amazing-saree
Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

2 weeks ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.