Amavasya: ప్రతి నెల మనకు అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం. అయితే ఇలా అమావాస్య పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. అయితే చాలా మంది అమావాస్య రోజు మంచిది కాదు అని భావిస్తుంటారు కానీ అమావాస్య రోజు కూడా కొన్ని మంచి గడియలు ఉంటాయి. ఇలాంటి మంచి గడియలలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు అమావాస్య రోజున ఈ చిన్న పని చేస్తే అష్టైశ్వర్యాలు మీరు పెట్టే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
మరి అమావాస్య రోజున మనం ఎలాంటి పనులు చేయాలి ఏం చేస్తే లక్ష్మీదేవి కటకటాక్షాలు మనపై ఉంటాయనే విషయానికి వస్తే మనం మన ఇంట్లో విలువైనటువంటి డబ్బు బంగారు ఆభరణాలు లేదా ఇతర భూములకు సంబంధించిన పత్రాలను కూడా బీరువాలో భద్రంగా దాస్తూ ఉంటాము. అందుకే బీరువాను కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు అలాంటివారు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే సమస్యలన్నీ పోతాయి..
అమావాస్య రోజు బీరువాలో ఐదు గవ్వలు అలాగే మంచి పరిమళం వెదజల్లే సెంటు కుంకుమ, పసుపు చందనం వీటన్నింటిని ఒక చిన్న పసుపుపచ్చ గుడ్డలో కట్టి దేవుడి దగ్గర ఉంచి పూజ చేయాలి. ఇలా పూజ చేసినటువంటి వీటన్నింటినీ తీసుకొని బీరువాలో డబ్బు దాచే చోట పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు. ఇలా అమావాస్య రోజు బీరువాలో ఈ వస్తువులను పెట్టడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.