Kedarnath : కేదార్నాథ్ ప్రాంతమంతా శివనామస్మరణ మారమగుతోంది. భక్తులు ఆ నీలకంఠుడిని కన్నులారా చూసేందుకు పోటీపడ్డారు. చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. భక్తి పారవశ్యంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
మంగళవారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు పూజా కార్యక్రమాలు చేపట్టి ఆలయ తలుపులు తెరిచారు అర్చకులు.ఈరోజు మొదటి పూజా కార్యక్రమం కావడంతో దాదాపుగా 20 క్వింటాలకు పైగా పూలను స్వామివారికి, ఆలయానికి అలంకరించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే ఉక్కి మట్ట నుంచి తీసుకువచ్చారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు.
కేదార్నాథ్ ప్రాంతమంతా మంచు దుప్పటి పరుచుకుంది. పెద్దఎత్తున మంచు కురుస్తున్నప్పటికీ కూడా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సుమారు 7000 మందికి పైగా భక్తులు కేదార్నాథ్ స్వామి దర్శనార్థం వచ్చినట్లు తెలుస్తోంది
కేదార్నాథ్ ఓ పవిత్రమైన పుణ్యక్షేత్రం. భక్తులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఆ స్వామిని దర్శించుకోవాలన్న కోరికతో ఉంటారు. జ్యోతిర్లింగాలలో అయిదవ జ్యోతిర్లింగంగా కేదార్నాథ్ ను పూజిస్తారు. ఈ పుణ్యక్షేత్రానికి చాలా పురాణాలు ఉన్నాయి. అప్పట్లో శివుడు, పాండవులకు ఎద్దు రూపంలో కేదార్నాథ్ లో దర్శనమిచ్చారు అని ప్రతీతి.
సముద్ర మట్టానికి 3 వేల 581 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని 8వ, 9వ శతాబ్దాలలో జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించారు. అప్పటి గద్వాల్ రాజు ఆలయ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశాడు.
కేదార్నాథ్ లో ప్రస్తుతం మంచు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడికి వచ్చే యాత్రికులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలను జారీ చేశారు ఆలయ కమిటీ మెంబర్స్. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే నివాస ఏర్పాట్లు భక్తులు చేసుకోవాలని కేదార్‌నాథ్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
#WATCH उत्तराखंड: केदारनाथ धाम के कपाट खुल गए हैं। मंदिर को 20 क्विंटल फूलों से सजाया गया है। pic.twitter.com/4Z5lE4MPbJ
— ANI_HindiNews (@AHindinews) April 25, 2023