తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా బీజేపీ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం తెలంగాణలో లభించింది. ఈ అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీపై దూకుడు మంత్రం జపిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం బండి సంజయ్ టీం చేస్తుంది. అధికార పార్టీ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతూ కెసిఆర్ కి బలమైన ప్రత్యర్థి తామే అని బీజేపీ ప్రజలకు బలంగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లాంటి నాయకులు అందరూ కూడా దూకుడు మంత్రాన్ని జపిస్తున్నారు. ఈసారి తెలంగాణలో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
మరో ఐదు ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని బీజేపీ తమ క్యాడర్ కి కూడా చెబుతూ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా రెగ్యులర్ గా తెలంగాణకి వస్తూ కెసిఆర్ దూకుడు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలలో దిట్ట అనే పేరు ఉన్న కేసీఆర్ మాత్రం బీజేపీని నిలువరించే ప్రయత్నం తెలంగాణలో చేయలేకపోతున్నారు అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీతో ఏకంగా కేంద్రంలో మోడీని ఎదుర్కోవాలని కేసీఆర్ వ్యూహాలు వేసుకుంటున్నారు.
తనది మోడీ స్థాయి అని భావిస్తూ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేటీఆర్ కి రాష్ట్ర బాధ్యతలని అప్పగించారు. అయితే దేశ రాజకీయాలలో ప్రస్తుతం మోడీ చరిష్మా నడుస్తుందని, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీని ఎదుర్కోవడం కష్టం అనే మాట రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎంతగా బీజేపీని మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్న అది ఇంకా ప్రజలలో బీజేపీకి పాజిటివ్ వోటింగ్ పెరగడానికి కారణం అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు ఇండియన్స్ అందరూ కూడా హిందుత్వ అజెండాతో భారత్ లో అలాగే చూడాలని అనుకుంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మధ్యలోనే బాంబ్ దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎవరికి అవకాశం ఇచ్చే స్థితిలో లేరనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక కేసీఆర్ మాత్రం తెలంగాణని వదిలేయడంతో ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఇచ్చిన వారు అవుతున్నారని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.