Kasturi Shankar : సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు వంటి హిట్ సినిమాల్లో నటించి తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన సహజసిద్ధమైన Kasturi Shankar : సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు వంటి హిట్ సినిమాల్లో నటించి తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన సహజసిద్ధమైనయాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దక్షిణ భారత్‌లో దాదాపు అన్ని భాషల్లోనూ మంచి సినిమాలు చేసిన అనుభవం కస్తూరికి ఉంది. ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనలోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఇమె ముక్కుసూటి మనిషి ఏ విషయంపైనా మాట్లాడాలనుకుంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఇండస్ట్రీలో తనకు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్ గానే తన ఓపీనియన్ చెప్పే గట్స్ కస్తూరికి ఉన్నాయి. ఆమె చేసే కామెంట్స్ కూడా ఒక్కోసారి భారీగానే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కస్తూరి ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సీరియల్ చేస్తోంది. తులసి క్యారెక్టర్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
మోడల్‌గా, యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో యాక్ట్ చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది నటి కస్తూరి శంకర్. ఈమె అసలు పేరు సుమతి శంకర్. లా వరకు చదువుకున్నా నటన మీద ఉన్న ఆసక్తితో సినీరంగంవైపు అడుగులు వేసింది. తమిళ, తెలుగు, మళయాళం,కన్నడ భాషల్లో ఈమె నటించింది. 1992లో మిస్ చెన్నైగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లోనూ ఫైనల్ వరకు వెళ్లింది. కెరియర్ మంచి పీక్‌లో ఉన్నటైంలోనే కొన్ని రూమర్స్ కారణంగా కస్తూరి పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేశారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదుర్కున్న అనుభవాలను పంచుకుంది కస్తూరి.
” శంకర్ లాంటి డైరెక్టర్‌తో పనిచేయడం ఎంత అదృష్టమో అప్పట్లో నాకు తెలిసింది. అప్పుడు వయసులో నేను చాలా చిన్నదానిని. ఏదో సరదాగా ఆ సినిమా చేసేశాను. కమల్ హాసన్ నటించిన హిట్ మూవీ భారతీయుడులో హీరోయిన్ ఛాన్స్ ఫస్ట్ నాకే వచ్చింది. అప్పట్లో ఎలాగైనా ఆ ఆఫర్ అందుకోవాలని తెగ ట్రై చేశాను. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే డైరెక్టర్ కి బికినీ ఫోటోలు పంపించాను.
కానీ బ్యాడ్ లక్ నా వెంటే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయంలోనే రంగీలా మూవీ విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసింది. దీంతో ఎవరి నోట విన్నా ఊర్మిళ పేరే వినిపించింది. దీంతో భారతీయుడు ఫిల్మ్ మేకర్స్ దృష్టంతా ఆమె వైపు వెళ్ళింది. దీంతో ఊర్మిళను ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి క్యారెక్టర్ ఇచ్చి సరిపెట్టేశారు. అలా హీరోయిన్ కావాల్సిన నేను భారతీయుడికి కూతురిగా నటించాను. కొన్నాళ్ల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని శంకర్ ని అడిగితే.. మూవీలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పారు. దీంతో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను” అని కస్తూరి భారతీయుడు సినిమా అనుభవాలను పంచుకుంది.