Karthika Pournami: తెలుగు క్యాలెండర్ ప్రకారం 12 మాసాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి పవిత్రమైనవిగా భావిస్తారు ఒక్కో మాసానికి ఒక్కో రకమైనటువంటి విశిష్టత ఉంది. ఇలా తెలుగు క్యాలెండర్ ప్రకారం వచ్చే మాసాలలో కార్తీకమాసం ఒకటి కార్తీక మాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో శివ కేశవులను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఈతి బాధలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున భక్తులు దీపారాధన చేస్తూ శివకేశవులను స్మరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు 365 వొత్తులను వెలిగిస్తూ ఉంటారు.
ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు 365 వొత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగిస్తూ ఉంటారు. ఇలా వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అసలు ఎందుకు వెలిగిస్తారు అనే విషయానికి వస్తే… ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మనపై ఉంటుందని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా దీపారాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సంవత్సరంలో మనం కొన్నిసార్లు కొన్ని అనుకొని కారణాల వల్ల దీపారాధన చేయకుండా ఉంటాము ఇలా దీపారాధన చేయని వారు కార్తీక పౌర్ణమి రోజు 365 వొత్తులను ఒకేసారి వెలిగించటం వల్ల సంవత్సరం మొత్తం మనం దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుంది.
ఇలా ఏడాది మొత్తం మనం ఎప్పుడైనా పూజ చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం 365 వత్తులను వెలిగించడం వల్ల ఏడాది దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని అందుకే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున శివాలయంలో లేదా మన ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఆలయాలలోనూ అది కుదరని వాళ్ళు తులసి కోటముందు ఇలా 365 వొత్తులను వెలిగించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మనపై ఉంటుందని భావిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి ఇలా దీపాలను వెలిగిస్తూ ఆ శివకేశవుల అనుగ్రహం పొందుతారు.