Kantara: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో అయితే 60 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్ ని తెరకెక్కించే పనిలో దర్శక నటుడు రిషబ్ శెట్టి ఉన్నాడు. కాంతారా 2గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పటికే ఊర్వశీ రౌతేలాని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి సమితిలో ఈ సినిమాని ప్రదర్శించారు. దీనికోసం ఇప్పటికే రిషబ్ శెట్టి జెనీవా చేరుకున్నారు. ఇక ప్రకృతి, అడవుల పరిరక్షణలో కాంతారా సినిమా ఎలాంటి సందేశం ఇచ్చింది అనే అంశంపై రిషబ్ శెట్టి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితిలో ఒక సినిమాని ప్రదర్శిస్తున్నారు అంటే కచ్చితంగా అదొక గొప్ప గౌరవంగా భావించాలి.
ఇప్పుడు కాంతారా సినిమాకి అలాంటి హానర్ లభించడం విశేషం. కాంతార మూవీ కథాంశం కూడా అడవులని కాపాడుకోవాలి అనే అంశంచుట్టూనే తిరుగుతుంది. అడవిలో క్షేత్రపాలకుడుగా ఉండే వరాహస్వామి ఇందులో మెయిన్ లీడ్ అనే సంగతి అందరికి తెలిసిందే. అడవుల ప్రాధాన్యతని చాలా చక్కగా మూవీలో చూపించారు. ఈ నేపధ్యంలో అతనికి ఈ సినిమాని ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో రిషబ్ శెట్టి అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది.