Kalki Trailer : డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఏడి. గత కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ మీద సరైన బొమ్మ లేక హైదరాబాద్ టు ముంబైవరకు థియేటర్లన్నీ ఆకలి మీదున్నాయి. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగఅశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్లో 600 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్ ఫ్యాన్స్ లో క్రేజ్ ని పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. ఏపీ, తెలంగాణలోని సెలెక్టెడ్ స్క్రీన్లలో ట్రైలర్ ని స్పెషల్ ప్రీమియర్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్నకంటెంట్ గా అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి. మూడు నిముషాలున్న వీడియోలో తన విజన్ చూపించాడు నాగఅశ్విన్.
ప్రపంచపు మొదటి, చివరి ఊరిగా చెప్పుకునే కాశి మీద దుష్టశక్తుల కళ్ళు పడతాయి. లోక రక్షణ కోసం దేనికైనా సిద్ధమయ్యే అశ్వద్ధామ ఒక ప్రాణాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు. దానికి భైరవ హెల్ప్ అవసరమవుతుంది. కాలంతో పాటు ట్రావెల్ చేసే బుజ్జి వెహికిల్ ను తన వెంటే తీసుకుని తన లక్ష్యం వైపు బయలుదేరతాడు. లోక కళ్యాణం కోసం దాక్కుని ఉన్న అమ్మాయి ని తీసుకొచ్చే బాధ్యత భైరవది. అసలు కలియుగాంతం నుంచి కల్కి అవతారం వరకు వేల సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందనేది తెరమీద చూడాల్సిందే.
విజువల్స్ టెర్రిఫిక్ అనే మాట చాలా చిన్నదిగ అనిపిస్తుంది. నాగ అశ్విన్ డ్రీమ్ వరల్డ్ ఈ 3 నిమిషాలకే ఇలా అనిపిస్తే రేపు స్క్రీన్ మీద ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు. ప్రభాస్ ఇంట్రో, అమితాబ్ బచ్చన్ ఎలివేషన్స్ వావ్ అనిపిస్తున్నాయి. భీకరమైన దాడులు జరిగే సీన్స్ , షాకింగ్ గెటప్ లో కమల్ హాసన్ ను చూసి ఫ్యాన్స్ కు గూస్ బమ్స్ వస్తున్నాయి. జూన్ 27 ఇక థియేటర్స్ లో కల్కి ఎలాంటి మాయాజాలం చేసి రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.