Categories: EntertainmentLatest

Kalki 2898AD : కల్కి టీంతో వర్క్ చేస్తారా?..మేకర్స్ బంపర్ ఆఫర్

Kalki 2898AD : సలార్ సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ 2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది.ఇక మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా కల్కి టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.

kalki-2898ad-makers-announce-bumper-offer-for-prabhas-fans

మహానటి సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా హిట్ తో మరో అదిరిపోయే కథతో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి కల్కి 2898AD సినిమా తీస్తున్నాడు. పాన్ వరల్డ్ ప్రెస్టీజియస్ మూవీగా నాగ్ అశ్విన్ ఈ ఫాంటసీ సినిమాను తీస్తున్నారు. సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్న ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, అందాల ముద్దుగుమ్మ దిశా పటాని, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ సందడి షురూ అయ్యింది. ఈ సినిమా జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

kalki-2898ad-makers-announce-bumper-offer-for-prabhas-fans

తాజాగా కల్కి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అనౌన్స్‎మెంట్ ఇచ్చారు. సినిమా కోసం పనిచేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నారు. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీంలో జాయిన్ అవ్వొచ్చు అంటూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారు. అందుకే ఈ పోస్ట్ షేర్ చేసిన గంటల్లోనే నెట్టింట్టో తెగ చక్కర్లు కొడుతుంది.

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

2 days ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

2 days ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 days ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 days ago

Kalki 2898 AD Sequel: సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్!

Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…

1 week ago

Puranapanda Srinivas: తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…

2 weeks ago

This website uses cookies.