Categories: EntertainmentLatest

Kalki 2898 AD : వాళ్ళిద్దరితో చేయడం నాకు చాలా గర్వంగా ఉంది

Kalki 2898 AD : వరల్డ్‎వైడ్‎గా సినీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ కల్కి. సలార్ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.

kalki-2898-ad-i-am-very-proud-to-work-with-them-says-prabhas

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ మేగా ఈవెంట్ ని నిర్వహించింది కల్కి టీం. ప్రభాస్ బుజ్జి నీ ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను ఫిదా చేశాడు డార్లింగ్. ఆరడుగుల కటౌట్ చూసి అరుపులు కేకలతో మొత్తం గ్రౌండ్ దద్దరిల్లింది. భైరవ లుక్ తో ఆడియన్స్ కు పిచ్చెక్కిచ్చేసాడు. అలాగే బుజ్జి గ్లింప్స్ ను కూడా విడుదల చేసి మూవీ పైన ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎప్పుడు హాయ్ బాయ్ క్షేమంగా వెళ్ళండి అని చెప్పే ప్రభాస్ నాలుగు ముక్కలు మాట్లాడడంతో అభిమానుల్లో ఆనంద వేరే లెవెల్ లో ఉంది. అంతే కాదు సూపర్ స్టార్స్ తో పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ఇక ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

kalki-2898-ad-i-am-very-proud-to-work-with-them-says-prabhas

ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. “సెక్యూరిటీ ని దృష్టిలో పెట్టుకుని తక్కువ మందితో ఈవెంట్ చేశాం. ఎక్కువ మంది ఫ్యాన్స్ ను పిలవనందుకు క్షమించండి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సీనియర్ స్టార్ కమల్ హాసన్లు చూసి చిత్ర పరిశ్రమ స్పూర్తి పొందింది. వారిద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్, అశ్వనీదత్లకు చాలా చాలా థ్యాంక్స్.

kalki-2898-ad-i-am-very-proud-to-work-with-them-says-prabhas

‘సాగర సంగమం’ సినిమాలో కమల్ సర్ వేసుకున్న బట్టలు నచ్చి, నాకూ అలాంటివి కావాలని అమ్మని అడిగేవాణ్ని. ఆయన యాక్టింగ్ కు 100 దండాలు. నా హీరోయిన్ దీపికా పదుకొణె సో బ్యూటిఫుల్ అండ్ సూపర్ స్టార్. దిశా పటానీ వెరీ హాట్ హాట్ స్టార్. నిర్మాత అశ్వనీదత్ కు ఈ ఏజ్ లోనూ సినిమపై ప్రేమ తగ్గలేదు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు ఆయనలాగే ఉన్నారు”అని ప్రభాస్ తెలిపాడు.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

7 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.