Wed. Jan 21st, 2026

    Kajal Aggarwal : పెళ్లై బిడ్డపుట్టిన తర్వాత కాజల్ బికినీ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో విశ్వ నటుడు కమల్ హాసన్ కాస్త బలవంతం చేశారని చెప్పుకుంటున్నారు. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్, కమల్ హాసన్‌ల సినిమా అంటే ఖచ్చితంగా అందులో సామాజిక అంశం ఉండి తీరాల్సిందే. ఇండియన్ 2 లోనూ ఆ అంశాల చుట్టూనే కథ సాగుతుంది. ఇక ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, ప్రియ భవానీ శంకర్, వివేక్, బాబీ సింహ, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

    kajal-aggarwal-bikini treat in indian 2
    kajal-aggarwal-bikini treat in indian 2

    Kajal Aggarwal : కాజల్ శరీరాకృతిలో చాలా మార్పులొచ్చాయి.

    ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC 15 చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న శంకర్ మరోవైపు ఇండియన్ 2 ని పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 లో బికినీ ట్రీట్ ఇవ్వబోతుందంటూ వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి కాజల్ బికినీ ట్రీట్ ఇవ్వడం ఇదేమీ కొత్తకాదు.

    ఇంతకముందు అందాల ఆరబోతలో, బికినీ ట్రీట్ ఇవ్వడంలో అమ్మడు చెలరేగిపోయింది. అయితే, ఇప్పుడు కాజల్ ఓ బిడ్డకి తల్లి. ఇలాంటి సమయంలో బికినీ ట్రీట్ అంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చాక కాజల్ శరీరాకృతిలో చాలా మార్పులొచ్చాయి. బాగా బొద్దుగా మారింది. ముఖంలో కూడా బాగా మార్పు కనిపిస్తోంది. దాన్ని తగ్గించుకొని మునపటి అందాలతో కనిపించేందుకు బాగా శ్రమిస్తోంది కాజల్. ఇక ఇండియన్ 2లో కాజల్ బికినీ వేయడానికి కమల్ కూడా ఓ కారణం అంటున్నారు. ఆయన కోరిక మేరకే సీన్ డిమాండ్ చేయడం వల్ల చందమామ బికినీ వేసిందట. చూడాలి మరి ఇదే నిజమైతే ఇప్పుడు బికినీలో కాజల్ ఎలా ఉందో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.