Wed. Jan 21st, 2026

    Vastu Tips: సాధారణంగా మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడుతుంటుంది. కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం మరి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు మరి కొంతమందికి వివాహ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

    సాధారణంగా మనకు ఆర్థిక ఇబ్బందులు కనుక మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నాలు చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటకు ప్రత్యేకంగా ఆరాధన చేయటం ఎంతో ముఖ్యం. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజించటం వల్ల సకల సంపదలు కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

    ఇక వివాహ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి చాలీసా చదవడం ఎంతో ముఖ్యం. ఇలా తులసి మొక్కకు పూజ చేసి తులసి చాలీసా చదవటం వల్ల లక్ష్మీదేవితో పాటు శ్రీహరి అనుగ్రహాన్ని కూడా పొందగలరు ఇలా శ్రీహరి అనుగ్రహం పొందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే వివాహ సమస్యలు కూడా తొలగిపోయి వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.