Jio Cinema: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించబోతుంది. అలాగే మొబైల్ అత్యంత అవసరమైన ఎలక్ట్రికల్ డివైజ్ గా మారబోతుంది. భవిష్యత్తు అంతా కూడా మొబైల్ ఫోన్ లదే ఆధిపత్యం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలో మెజారిటీ మొబైల్ వినియోగదారుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్స్ వినియోగం కూడా పెరిగింది. వ్యాపారులు తమ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడం కోసం, ప్రమోట్ చేసుకోవడం కోసం విస్తృతంగా యాప్ ల మీద ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వ్యాపారం ఈ కామర్స్ యాప్ ల ద్వారా జరుగుతోంది.
మార్కెట్ లో దొరికే అన్ని రకాల ఉత్పత్తులు ఈ కామర్స్ యాత్ర ద్వారా డోర్ డెలివరీ లభిస్తున్నాయి. అలాగే ప్రోడక్ట్ ని ముందుగానే చూసుకొని వాటి రివ్యూ, రేటింగ్ చెక్ చేసుకొని కొనుక్కొనే సదుపాయం యాప్ లలో లభిస్తుంది. దీంతో వినియోగదారులు విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా డిజిటల్ యాప్స్ ల రూపంలో వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా లాంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు క్రికెట్ చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో కూడా క్రికెట్ మ్యాచ్ లు చూసే అవకాశం దొరికింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి జియో సినిమా కూడా వచ్చి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యధిక రంగాలలో వ్యాపారం చేస్తున్న పరిశ్రమగా ఉంది. సినిమా నిర్మాణం నుంచి వినియోగదారులకి అవసరమయ్యే కూరగాయల వరకు అన్ని రంగాలలో రిలయన్స్ పెట్టుబడులు ఉన్నాయి. టెలికాం రంగంలో జియో టాప్ చైర్ లో ఉంది. ఇప్పుడు జియో సినిమా యాప్ ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్ 2023 రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఇండియాలో దాని వినియోగదారులు పెరిగిపోయారు. ఒక్కరోజులో 3.5 కోట్ల మంది జియో సినిమా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా టెక్ హిస్టరీలో ఒక రికార్డు క్రియేట్ అయింది. అత్యధిక మంది ఒకేరోజు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గా ఇప్పుడు జియో సినిమా ఉండడం విశేషం.