Technology: వన్ ప్లస్ 10-సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు జియో 5G మద్దతును అందించే విధంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రారంభించింది. OnePlus 10 Pro, OnePlus 10T , OnePlus 10R పరికరాలు ఈ అప్డేట్ లను అందుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ అప్‌డేట్‌లు అస్థిరమైన రీతిలో విడుదల అవుతున్నాయి.
ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు మాత్రమే దీనిని పొందుతున్నారు. OnePlus కమ్యూనిటీ ఫోరమ్‌లో అందుబాటులో ఉన్న అధికారిక వివరాల ప్రకారం, OnePlus 10T , OnePlus 10 Pro అక్టోబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను రిసీవ్ చేసుకుంటున్నాయి. మరోవైపు, 10R సెప్టెంబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను అందుకుంటుంది.
వన్ ప్లస్ 10 Proకి ప్రత్యేకమైన NE2211_11.A.18 , జియో 5G మద్దతు, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను మాత్రమే జోడిస్తుందని చేంజ్‌లాగ్ హైలైట్ చేస్తుంది.
ఇక CPH2413_11.A.10 , వన్ ప్లస్ 10 T లో అప్పుడప్పుడు వచ్చే క్రాష్ సమస్య లను పరిష్కరిస్తుంది. ఇది Wi-Fi స్థిరత్వాన్ని, నెట్‌వర్క్ అనుభవాన్ని , కమ్యూనికేషన్ స్టెబిలిటీని, స్క్రీన్ డిస్‌ప్లే ఎఫెక్ట్ ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది.
10 R ఎడ్యురన్స్ ఎడిషన్ , వన్ ప్లస్ 10 R లో వచ్చే సమస్యలను CPH2411_11.A.09 , CPH2423_11.A.09 లు ఫిక్స్ చేస్తాయి.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఈ నాలుగు నగరాల్లో మాత్రమే జియో తన 5G సేవలను పరీక్షిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ లో మరిన్ని నగరాలను కవర్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తించాలి. ఎంపిక చేసిన వినియోగదారులతో మాత్రమే కనెక్టివిటీ ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తోంది. వినియోగదారులందరూ ఇంకా జియో 5G సేవలను పొందడం లేదు. లభ్యతను తనిఖీ చేయడానికి, MyJio ఫోన్ యాప్‌ని సెర్చ్ చేస్తూ ఉండండి.