Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని దర్శకధీరుడు రాజమౌళి ఆకర్షించాడని చెప్పాలి. అసలు హాలీవుడ్ లో ఇండియన్ సినిమాల గురించి ఎప్పుడూ పెద్ద చర్చ ఉండదు. ఇండియన్ కథలపైన కూడా వారికి సరైన అభిప్రాయం లేదు. ఇండియన్ సినిమాలు అంటే కమర్షియల్ జోనర్ కథలు మాత్రమే ఉంటాయని హాలీవుడ్ దర్శకులలో చాలా మంది అభిప్రాయం. ఇక ఇండియన్ సినిమాలు ఎంతో గొప్పగా ఉందని అనిపిస్తే తప్ప వారు చూడటానికి ఆసక్తి చూపించరు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాని హాలీవుడ్ దర్శక, నిర్మాతలలో చాలా మంది చూశారు. అద్బుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఇక కొద్ది రోజుల క్రితం స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా నేరుగా లైవ్ వీడియోలో రాజమౌళితో మాట్లాడారు.
ఇక స్పిల్ బర్గ్ లాంటి దర్శకుడు రాజమౌళి టాలెంట్ ని గుర్తించి అభినందించడంతో పాటు చాలా విషయాలని అతనితో చర్చించారు. ఇదిలా ఉంటే అవతార్ 2తో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ ఎంతో అద్బుతమైన చిత్రం. నేను మొదటిసారి ఆ సినిమాని చూసినపుడు ఆశ్చర్యం వేసింది. సినిమా అంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదని, కథ చెప్పడంలో కూడా గొప్పతనం ఉంటుందని ఆర్ఆర్ఆర్ చూసాక అర్ధమైంది.
కథ చెప్పడంతో రాజమౌళి నా దృష్టిలో షేక్స్ పియర్ లా కనిపించాడు. అతని శైలిలో క్లాసిజం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రని అద్బుతంగా ఆవిష్కరించారు. అతని నటన కూడా అద్బుతంగా ఉంది. ఈ సినిమా గురించి రాజమౌళితో చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నా, అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో సమయం తక్కువ ఉండటంతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. కచ్చితంగా మరోసారి అతనితో మాట్లాడాలని అనుకుంటున్నాను. అంటూ జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమోషన్స్ ని అద్బుతంగా తెరపై ఆవిష్కరించే జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు రాజమౌళి ప్రతిభని ప్రశంసించారు అంటూ కచ్చితంగా తెలుగు వారు అందరూ గర్వంగా చెప్పుకోవాలి.