Jayaprada : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జయప్రద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైంది. యూపి ఖాకీలు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీంను రెడీ అయింది. హీరోయిన్ కం పొలిటీషియనైన జయప్రద ఏం తప్పు చేసింది? అసలు యూపీ పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ నేరం కింద ఆమె అరెస్టు కాబోతోంది? ఇప్పుడు ఇదే ఈ విషయం పైన పెద్ద చర్చ జరుగుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జయప్రద గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో అగ్రతారగా ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. తన అందంతో యాక్టింగ్ తో డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది జయప్రద. ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కథలోని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోసే సీనియర్ నటీమణుల్లో జయప్రద కూడా ఒకరు. ఆమె తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి తన సత్తాను దేశవ్యాప్తంగా చాటింది.
జయప్రదకు చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయపరంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినీ కెరీర్ లో ఓ ఎత్తుకు ఎదిగిన తర్వాత జయప్రద 1994లో రాజకీయ ప్రవేశం చేసింది. తెలుగుదేశం పార్టీ తన మొదటి పార్టీ. ఆ తర్వాత కొన్నేళ్ళకే టీడీపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి పదేళ్ల వరకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి ఎంపీగా పనిచేసింది. ఆ తర్వాత 2019 నుంచి బిజెపిలో చేరింది.అయితే 2019 ఎలక్షన్స్ సందర్భంగా జయప్రద రూల్స్ అతిక్రమించారని ఆమెపై నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేశారు. ఈ కేసులో భాగంగానే తాజాగా ఈమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు. దీంతో సీరియస్ అయిన న్యాయవాది ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి జయప్రదను అరెస్టు చేయాలని పోలీసులకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ క్రమంలోనే లేడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు మెంబర్స్ తో ఒక స్పెషల్ టీం ఏర్పాటైంది. ఈ టీమ్ జయప్రద ను వెతికి పట్టుకుని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు సమాచారం.
యూపీ ఎలక్షన్ లలో జయప్రద రాంపూర్ నుంచి బరిలోకి దిగింది. తన ఆపొజిషన్ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజామ్ ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో జయప్రద ఈ కేసు పైన ఎలా స్పందిస్తుందో వెయిట్ చేసి చూడాలి మరి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.