Wed. Jan 21st, 2026

    Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే విధంగా దూసుకెళ్తుంది. రెండో సినిమా నీ ఏకంగా బయోపిక్ కథని ఎంపిక చేసుకుని సంచలనం క్రియేట్ చేసింది.

    janhvi-kapoor-waiting-for-jr-ntr-30
    janhvi-kapoor-waiting-for-jr-ntr-30

    గుంజన్ సక్సేనా పాత్రలో ఈమె రెండో సినిమాలో నటించి మెప్పించింది. అయితే బాలీవుడ్ లో రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా తనకంటూ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే దిశగా ఫిమేల్ సెంట్రిక్ కథలతో జాన్వీ కపూర్ ప్రయాణం చేస్తుంది.

    Times Janhvi Kapoor looked hot in body hugging dresses - BMHRC

    తన తండ్రి నిర్మాత కావడంతో సొంత ప్రొడక్షన్ లోనే ఆమె సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే చాలా కాలంగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఆమెను తెలుగులో పరిచయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

    10 promotional looks of Janhvi Kapoor for 'Mili' | Times of India

    ఇక జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఒక భారీ సినిమాతో పరిచయం కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకే కొంతమంది చిన్న సినిమాలు కోసం ఆమెను సంప్రదించిన కూడా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ 30వ చిత్రం కోసం కొరటాల శివ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా సినిమాలో ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది.

     

    ఈనెల ఆఖరులో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది అని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 20 తర్వాత రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉన్న ప్రారంభోత్సవం రోజున అధికారికంగా హీరోయిన్ పేరు ఖరారు చేసిన అవకాశం ఉందని తెలుస్తుంది.

    Janhvi Kapoor showed her bold style in a saree! Click here to see her photos

    ఈ నేపధ్యంలోనే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే ఖరారు అయిందని మాట వినిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ చిత్రం తనకి మంచి బూస్టర్ అవుతుందని ఈ అందాల భామ కూడా అనుకుంటున్నట్లుగా సమాచారం. ఇక చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫామ్ చేసేంతవరకు తాను ఈ విషయాన్ని రివిల్ చేయకూడదని జాన్వీ కపూర్ కూడా ఫిక్స్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది.