Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూట్ జాన్వీ కపూర్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ భామ సొంతం. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు వివిధ రకాల మోడ్రన్ స్టైల్‌లను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. అది బికినీ అయినా లేదా సొగసైన ఆరు గజాల చీర అయినా, ఆమె ఏ సందర్భానికైనా ఎలాంటి దుస్తులనైనా అద్భుతంగా చూపించగలదు.
ఇటీవల, జాన్వీ తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ట్రీట్ చేసింది, తన అద్భుతమైన గౌనుతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఆమె ఫ్యాషనబుల్ అవతార్‌ని చూసి ఆమె అభిమానులు విస్మయం చెందారు.
వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ ఎలిఫెంట్ ఫ్యామిలీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లండన్‌లో జరిగిన యానిమల్ బాల్ కార్యక్రమానికి నటి జాన్వీ కపూర్ అటెండ్ అయ్యింది . ఫ్యాషన్ డిజైనర్లు – మనీష్ మల్హోత్రా, సబ్యసాచి ముఖర్జీ, అనితా డోంగ్రే సహా పలువురు భారతీయ ప్రముఖులు బాల్‌కు హాజరయ్యారు. కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లా కూడా కనిపించారు. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ కూడా స్టార్-స్టడెడ్ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఈవెంట్ కోసం మనీష్ మల్హోత్రా క్రియేషన్‌ను ధరించి ఆదరగొట్టింది.
బాలీవుడ్ ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా యానిమల్ బాల్ నుండి జాన్వీ కపూర్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. జాన్వీ బంగారు వర్ణం లో ఉన్న ఫ్లోర్ స్వీపింగ్ లాంగ్ కోట్ గౌను వేసుకుని మెరిసింది.ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ యొక్క తాజా సేకరణ నుండి మహారాజా లయన్ మాస్క్ ధరించింది. ప్రకాశవంతమైన, సొగసైన అవుట్ ఫిట్ లో జాన్వి అందరి దృష్టిని ఆకర్షించింది.
స్లీవ్‌లెస్, హాల్టర్ స్ట్రాప్‌లు,డీప్ నెక్‌లైన్, సైడ్‌లో మిడ్‌రిఫ్-బేరింగ్ కటౌట్, వెనుక భాగంలో పొడవైన ట్రైన్ , బ్యాక్‌లెస్ వివరాలు కలిగిన గోల్డెన్ గౌనులో ఆమె కుందనపు బొమ్మలా మత్స్యకన్యలా మెరిసింది.
జాన్వీ స్టైలింగ్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది . మీ స్టైల్ గేమ్‌ను ఎలివేట్ చేయడానికి జాన్వీ ఫ్యాషన్ డైరీల కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఆమె అద్భుతమైన లుక్ ను పూర్తి చేయడానికి, జాన్వీ కపూర్ సింపుల్ లుక్ ని ఫాలో అయ్యింది. ఆమె మొత్తం రూపానికి అధునాతనంగా మార్చుకుంది.
వర్క్ ఫ్రంట్‌లో, జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటుడు వరుణ్ ధావన్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ తో కలిసి బవాల్ సినిమా చేస్తోంది. ఆమె రాజ్‌కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కూడా నటించనుంది. ఇటీవల ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30 సినిమా దేవర షూటింగ్ ను ప్రారంభించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది జాన్వీ.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.