Janasena Party: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో గెలవాలని బలమైన వ్యూహాలు వేసుకుంటుంది.దానికి తగ్గట్లుగానే ప్రచార పర్వానికి తెరతీసింది. మరో వైపు ప్రజలకి సంబందించిన సమాచారాన్ని కూడా జగనన్నే మీ భవిష్యత్తు ద్వారా సేకరించే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంతో జనసేన, టీడీపీ వ్యూహాత్మక విధానాలతో వెళ్తున్నాయి. ఇప్పటికే టీడీపీ యువగళం, చంద్రబాబు జిల్లాల పర్యటనతో వైసీపీకి చెమటలు పడుతున్నాయి. బయటకి గంభీరంగా విమర్శలు చేస్తున్న కూడా ప్రతిపక్షాలకి పెరుగుతున్న బలం వైసీపీ అధిష్టానం కూడా గుర్తిస్తుంది. జనసేన నాయకులు కూడా నియోజకవర్గాలలో గడపగడపకి వెళ్తూ బలంగా తమ వాణి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికార పార్టీ వైఫల్యాలని ఎండగడుతూ ముందుకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు హైదరాబాద్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గంటకి పైగా వీరిద్దరూ రాజకీయ కార్యాచరణపై చర్చించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడానికి ఎలా వెళ్తే బాగుంటుంది అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కలయిక వైసీపీకి మిగుడుపడటం లేదు. టీడీపీ, జనసేన కలిస్తే ఓటమి గ్యారెంటీ అని ముందే వైసీపీ నేతలు వర్రీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఎలా అయిన వారిని విడగొట్టడం, లేదంటే క్యాడర్ నుంచి జనసేనకి సపోర్ట్ లేకుండా చేయడం ద్వారా లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుంది.
అయితే జనసేన కోసం పనిచేసే క్యాడర్ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవడంతో వైసీపీ మంత్రులు, సోషల్ మీడియాలో కార్యకర్తలు ఒక్కసారిగా విమర్శలు స్టార్ట్ చేశారు. పొత్తు ఖాయం అయిపొయింది అన్నంతగా వారు ప్రజల్లోకి టీడీపీ, జనసేన బంధాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇక వైసీపీ నాయకుల పదే పదే విమర్శలతో ఇప్పుడు టీడీపీ, జనసేన బంధాన్ని ప్రజలు కూడా స్వాగతించే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. గత ఎన్నికలలో ఏ నెగిటివ్ ప్రచారం అయితే వైసీపీకి కలిసోచ్చిందో ఇప్పుడు అదే ప్రచారం జనసేన, టీడీపీకి బలంగా మారేలా ఉందనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.