AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మార్చి 14 జనసేన పార్టీకి చాలా కీలకంగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ దిశ, దశ ఏంటి అనేది ఆ రోజుతో ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. దీనికోసం మార్చి 11 నుంచి పవన్ కళ్యాణ్ మరల రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాడు. ఇక 11, 12, 13 తేదీలలో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో `అందుబాటులో ఉండటంతో పాటు పార్టీ నాయకులుతో కీలక అంశాలని పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎన్నికల కార్యాచరణ, అలాగే రూట్ మ్యాప్, ఎన్నికల హామీలకి సంబందించిన విషయాలపై ఆ మూడు రోజులు నాయకులతో పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారని తెలుస్తుంది.
అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్న జనసేన బలంపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నాడు. ఇప్పటికే టీడీపీతో పొత్తు అనధికారికంగా ఖాయం అయ్యిందనే ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తుంది. సీట్ల ఒప్పందం కూడా జరిగిపోయిందని టాక్. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా నష్టమే తప్ప లాభం ఉండదని కొంత మంది చెబుతున్న కూడా పవన్ కళ్యాణ్ తన ఆలోచనా విధానంతో వ్యూహాలు సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నారు.
ముందుగా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ ఉందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యం మార్చి 11 నుంచి కార్యాచరణ మొదలు పెట్టి మార్చి 14 తర్వాత గేర్ మార్చి తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొట్టు పెట్టుకున్న తనకున్న బలాన్ని నిరూపించుకోవాలి అంటే కచ్చితంగా పోటీ చేయబోయే నియోజకవర్గాలలో విస్తృతస్థాయిలో గ్రౌండ్ లెవల్ క్యాడర్ ని సిద్ధం చేసుకోవాలని కూడా చెబుతున్నారు. అలా జరిగితేనే స్థిరమైన, బలమైన రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగే అవకాశం ఉందనేది చాలా మంది మాట.