janasena-party-get-possitive-vibe-in-public
Janasena Party: ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు రాజకీయ క్షేత్రంలో బలమైన వ్యూహాలతో ఎన్నికలకి సిద్ధం అవుతున్నాయి. మరో వైపు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాత్మక విధానాలతో ముందుకి వెళ్తున్నారు. అయితే టీడీపీ, వైసీపీ అంత స్పీడ్ గా అయితే జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలోకి ఫైట్ చేయడం లేదనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అలాగే జనసేన పార్టీలో ఏ పార్టీ నుంచి నాయకులు చేరడం లేదని, ఇదే ఆ పార్టీ బలహీనంగా ఉందని చెప్పడానికి కారణంగా చూపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల మాటల బట్టి టీడీపీ, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకులు వచ్చి జనసేనలో చేరిపోతేనే ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అర్ధం.
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి పూర్తిగా భిన్నమైన విధానాలతో జనసేన పార్టీ ప్రజలలోకి వెళ్తుంది అనేది చాలా తక్కువ మందికి అర్ధమయ్యే మాట. కొత్తతరం నాయకులని తయారు చేయాలనేది జనసేన సిద్ధాంతాలలో భాగం. ఉన్నవారికె మరల పదవులు ఇవ్వడం, ఎమ్మెల్యేగా నిలబెట్టి పెత్తనం ఇవ్వడం అనేది జనసేన ఉద్దేశ్యం కాదని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అన్ని పార్టీల పక్కనే జనసేనని కూడా కట్టేస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరుగా ఉందనేది జనసేన పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులు చెబుతున్న మాట.
జనసేన పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్దాంతాలు ప్రజలలోకి బలంగా వెళ్లాయని వారు అంటున్నారు. వారంతా పవన్ కళ్యాణ్ లో ఓ కొత్తతరం నాయకుడిని చూస్తున్నారని అంటున్నారు. అలాగే భవిష్యత్తుని చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా జనసేన మీద దాడి చేస్తూ టీడీపీ దత్తపుత్రుడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారని, ఇదే రేపు జనసేనని అధికారంలోకి తీసుకొస్తుందని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం అర్ధమైన ఎవరూ కూడా కచ్చితంగా గ్రౌండ్ లెవల్ లో జనసేన బలాన్ని కూడా అర్ధం చేసుకుంటారని జనసేన సీనియర్ నాయకులు చెప్పే మాట.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.