AP Politics: ఏపీలో అన్ని పార్టీలు ఎవరి స్థాయిలో వారు రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఇక అధికార పార్టీ ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం మొదలు పెట్టబోతుంది. మారి 18 తర్వతః ఎమ్మెల్యేలు అందరూ వాలంటీర్లు, గ్రామ సారథులతో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రచారం నిర్వహించాలని క్లియర్ గా జగన్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు కూడా జోనల్ వైజ్ గా మీటింగ్ లు నిర్వహిస్తూ అభ్యర్ధులని ఖరారు చేసుకుంటున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టింది.
వచ్చే నెలలో ఆవిర్భావ సభ జరగబోతుంది. తరువాత ప్రజా క్షేత్రంలోని పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచి చాలా ఏజెన్సీలో సర్వేలు స్టార్ట్ చేస్తున్నాయి. తాజాగా ఆత్మసాక్షి సర్వే అంటూ ఒకటి బయటకి వచ్చింది. దీని ప్రకారం వచ్చే ఎన్నికలలో ఎవరికీ వారు ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ 73 నుంచి 75 స్థానాలని కైవసం చేసుకుంటుంది అని చెబుతున్నారు. ఇక జనసేన కేవలం 6 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో పేర్కొన్నారు.
ఇక వైసీపీ 60 నుంచి 65 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే టీడీపీ జనసేన కలిస్తే మాత్రం కచ్చితంగ 110 నుంచి 120 స్థానాలలో గెలిచి కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే వీరితో వామపక్షాలు కలిస్తే మరింతగా మెజారిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. అలా కాకుండా బీజేపీ జనసేన, టీడీపీ కలిస్తే మాత్రం కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. మరి పొత్తుల ఆటలో జనసేన, టీడీపీ పొత్తుతోనే ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే జనసేన భారీగా సీట్లు డిమాండ్ చేయడంతో పొత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది అర్ధం కావడం లేదు.