Janasena: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ అండతో బీజేపీని ఏపీలో విస్తరించాలని మోడీ సేన ఆలోచిస్తుంది. అయితే జనసేన మాత్రం ప్రత్యామ్నాయ శక్తిగా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఉండాలని చూస్తుంది. ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ సభ ఈనెల 14వ తేదీన మచిలీపట్నం వేదికగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం ఇప్పటికే మచిలీపట్నంలో రైతులు భారీగా భూములు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ జనసేన నాయకులు సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ఫార్మేషన్ డే కోసం ఏకంగా ఐదు లక్షల మంది వస్తారని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు.
జనసేన ఆవిర్భావ సభతో పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల శంఖారావం మోగించబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంత బలంగా జనసేన బరిలోకి దిగుతుంది అన్నది ఆవిర్భావ సభ ద్వారా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తులతో కలిసి వెళ్తారా లేదా అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ సభ కోసం మంగళగిరి నుంచి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ ని మచిలీపట్నం తీసుకువెళ్ళే ఆలోచన జనసేన నాయకులు, సైనికులు చేస్తున్నారు.
ఈ ర్యాలీని ఏకంగా 10,000 బైకులతో జనసైనికులు నిర్వహించడానికి తెలుస్తుంది. తాజాగా జనసేన నాయకులు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఏపీలో రోడ్ షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసైనికులు సేనానిని ర్యాలీగా తీసుకొని వెళ్ళాలనే ఆలోచన సాధ్యమవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేన ఆవిర్భావ సభ మాత్రం ఈసారి ఆ పార్టీ బల నిరూపణకి వేదికగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.