Janasena: ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజాభిమానం సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేనానిని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. తమతో కలిసి వస్తేనే జనసేన పార్టీ మంచింది లేదంటే ప్యాకేజీకి అమ్ముడు పోయింది అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుంది. అలాగే ఒంటరిగా పోటీ చేసి తమ గెలుపుకి అవకాశం ఇస్తే జనసేన మంచిది లేదంటే ప్యాకేజీ పార్టీ అంటూ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. అయితే రెండు పార్టీల ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పవన్ కళ్యాణ్ పై ఇద్దరు కావాలనే బురద జల్లుతున్నారు అనే టాక్ ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు.
ఈ నేపధ్యంలో ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ పై ఆలోచన మారినట్లు తెలుస్తుంది. అలాగే రెండు పార్టీలు గత కొంత కాలంగా హింసాత్మక ధోరణిలో రాజకీయాలు చేస్తున్నాయి. అలాగే వారు ప్రజలలోకి వెళ్తూ చెబుతున్న మాటలు కూడా ప్రజలని బానిసలుగా చూస్తూ తమకి అధికారం ఇస్తే మీ బ్రతుకులని ఉద్దరిస్తాం అనే పంథాలో సాగుతున్నాయి. అయితే ఇప్పటికే చంద్రబాబు పాలనని సుదీర్ఘ కాలం చూసిన ప్రజలు మళ్ళీ అతన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే జగన్ పాలన ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో చూస్తున్నారు.
ఈ నేపధ్యంలో మూడో వ్యక్తిగా వస్తున్న పవన్ కళ్యాణ్ కి ఇస్తే తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచన ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా చేగొండి హరిరామజోగయ్య ఏపీలో సర్వే నిర్వహించారు. దీనిలో 90 శాతం మంది జనసేనకి అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని చెప్పారు. ఇక వైసీపీకి 35 శాతం మాత్రమే సంక్షేమ పథకాల కారణంగా అనుకూలంగా ఉన్నారని, టీడీపీకి కూడా 35 శాతం అనుకూలత ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని ఎవరైతే ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతారో వారికే ప్రజలు పట్టం కడతారని హరిరామ జోగయ్య పేర్కొనడం విశేషం.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.