AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసిపి మూడు రాజధానుల జెండాతో ముందుకు వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ త్వరలో విశాఖ తాను కూడా షిఫ్ట్ అవుతున్నానని అక్కడి నుంచి పరిపాలన ఉంటుందని చెప్పారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ సదస్సులో కూడా విశాఖపట్నం రాజధాని కాబోతుందని తెలియజేశారు. అయితే మూడు రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఖచ్చితమైన నిర్ణయాన్ని జగన్ ప్రకటించలేకపోతున్నారని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తూ వచ్చింది.
అయితే ఈ విషయంలో జగన్ చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో జూలై నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. జూలైలో విశాఖ వెళ్లడం ఖాయమని తెలియజేశారు. అలాగే ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. గెలవని పక్షంలో మంత్రుల పదవులు ఊడిపోవడం గ్యారంటీ అని కూడా క్లారిటీ ఇచ్చేసారు. అలాగే సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను కూడా తిప్పి కొట్టాలని తెలిపారు. దీనిబట్టి మూడు రోజుల అజెండాలో జగన్ సుఖసంతో కూడా ప్రస్తుతం విశాఖ రాజధాని చుట్టూనే ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి అదే పనిగా ఇలా విశాఖని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటనలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. సుప్రీంకోర్టులపైన కూడా జగన్ కి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.