Wed. Jan 21st, 2026

    Keerthi Suresh : టాలీవుడ్‌లో అందరికంటే ఘోరంగా ఉంది అంటే కీర్తి సురేష్ కెరియర్ అని చెప్పక తప్పదు. ఈ బ్యూటీ ప్రారంభంలో సంపాదించుకున్న క్రేజ్‌కి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో అసాధారణమైన పాపులారిటీని తెచ్చుకోవాల్సింది. కానీ, దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా మహానటి లాంటి భారీ హిట్ తర్వాత వరుసగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా మిగిలాయి. దాంతో కమర్షియల్ హీరోయిన్‌గా నిలబడాల్సిన కీర్తి సురేష్ అక్కడే ఆగిపోయింది.

     It is not clear what kind of decision Keerthi Suresh will take in this matter.
    It is not clear what kind of decision Keerthi Suresh will take in this matter.

    ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తుంది తెలుగులో రెండు సినిమాలు మాత్రమే. వాటిలో నాని సరసన చేస్తున్న దసరా మాత్రమే హీరోయిన్‌గా నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – తమన్నా జంటగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయినా అమ్మడికి పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రచారం జరుగుతోంది. అయినా కూడా కీర్తి ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంది.

    ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత కీర్తి సైన్ చేసిన సినిమా ఒక్క దసరా మాత్రమే. సర్కారు వారి పాట ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న దసరా సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ఓ క్లారిటీకి వస్తుందట. ఎలాంటి గ్లామర్ పాత్రలను ఎంచుకోవాలి, ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి..అనే విషయాలలో ఓ డెసిషన్ తీసుకుంటుందని సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఇటీవల కీర్తి సురేష్ ఫొటోస్ చూస్తే అందాల ఆరబోతకి సై అంటుందని తెలుస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.