Politics: కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. బీజేపీలోకి వెళ్లిన కూడా తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను గట్టిగానే క్యాంపైన్ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలిచి తీరాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీజేపీ పుంజుకుంటుంది.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ప్రజలలో బీజేపీ బలం పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికలలో గెలిచిన పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ తరుపున ఉప ఎన్నికలకి సిద్ధమయ్యారు. దీనిలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న కూడా అంతర్గత కుమ్ములాటల మధ్య అసలు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు. ఇక ప్రజలు కూడా మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే అన్నట్లు చూస్తున్నారు. మరి అంతిమంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం మంత్రానికి ఓటు వేస్తారా అనేది చూడాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజల తీర్పు అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.