Wed. Jan 21st, 2026

    Krithi Shetty – Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ కృతిశెట్టి, శ్రీలీల కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఇలాంటి మార్పు ఈ బ్యూటీస్ కెరీర్‌లో జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉప్పెన సినిమాతో తెల్లుగుతెరకి పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతో లక్కీ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. దాంతో వరుసగా 6 సినిమాలను ఒప్పుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం అంటూ వరుసబెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.

    అయితే, ఉప్పెన తర్వాత కృతిశెట్టి ఒప్పుకున్న సినిమాల కథలు అంత గొప్పగా లేకపోవడంతో తిరిగి ఫ్లాపులను చూడాల్సి వచ్చింది. మంచి ఫిజిక్..ఇప్పుడున్న కుర్ర హీరోలందరికీ సూటయ్యే ఏజ్ కావడంతో దాదాపు తన వద్దకి వచ్చిన సినిమాలను కమిటైంది. అదే కృతిశెట్టి వరుస ఫ్లాపులకి కారణం అయింది. లాజికల్‌గా ఆలోచించి ఈ కథ నాకు సూటవుతుందా..హిట్ అందుకుంటానా..? అని ఆలోచిస్తే ఇప్పుడు కృతి కెరీర్ ఇంకోలా సాగేది. సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడం వల్లే అమ్మడికి ఇప్పుడు ఆశించిన అవకాశాలు లేవు.

    Is this the reason why Krithi shetty - Sreeleela's career ended like this..?
    Is this the reason why Krithi shetty – Sreeleela’s career ended like this..?

    Krithi Shetty – Sreeleela : కథే ముఖ్యం అనుకున్న శ్రీలీల..

    కానీ, శ్రీలీల అలా కాదు. మొదటి సినిమా అగ్ర దర్శకుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందD విమర్శకుల నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ దక్కించుకున్నా, ఆ తర్వాత తెలివిగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కథే ముఖ్యం అనుకున్న శ్రీలీల రవితేజ లాంటి సీనియర్ హీరో సరసన అవకాశం వస్తే రిజెక్ట్ చేయకుండా ఒప్పుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనప్పుడు మెజారిటీ భాగం ప్రేక్షకులు శ్రీలీలను కామెంట్స్ చేశారు.

    కానీ, ధమాకా బ్లాక్ బస్టర్ అయ్యాక శభాష్ అన్నారు. ఇప్పుడు కూడా బాలయ్య సినిమాలో, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఎంపికైంది. ఎంత పెద్ద బ్యానర్ అయినా కథ, అందులో తన పాత్ర బావుంటుందీ అంటేనే సైన్ చేస్తోంది. లేదంటే సున్నితంగా NO చెప్తోంది. అందుకే, స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న కృతిశెట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే, అమ్మడు కష్టమే అనుకున్న శ్రీలీల మాత్రం పెద్ద సంస్థలు స్టార్ హీరోలతో సినిమాలను కమిటవుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.