War: యుద్ధం… ఈ పదం చిన్నదే కాని దాని ద్వారా జరిగే విధ్వంసం మాత్రం మాటలలో వర్ణించలేని స్థాయిలో ఉంటుంది. ఆ యుద్ధం కారణంగా జరిగే ప్రాణ నష్టం లక్షల నుంచి కొట్లలో కూడా ఉంటుంది. ఆ యుద్ధం మిగిల్చిన కన్నీళ్లు కొన్ని దశాబ్దాల పాటు ప్రజలని విషాదంలోని నడిపిస్తాయి. ఆ యుద్ధం రాసిన జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. అలాగే యుద్ధంతో జరిగే ఆర్ధిక నష్టం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో అగ్ర రాజ్యం అయిన రష్యా అతి చిన్న దేశం అయిన ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతుంది.
ఇప్పటికే వేలాది సంఖ్యలో సైనికుల ప్రాణాలు పోయాయి. ఇటు ఉక్రెయిన్ లో కూడా ప్రజలు, సైనికులు వేలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మారణహోమం లో లక్షలాది మంది ప్రజలు గాయాలతో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. అయితే ఈ యుద్ధంలో అతి చిన్న దేశం అయిన ఉక్రెయిన్ ని ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఉన్న రష్యా ఇప్పటి వరకు హస్తగతం చేసుకోలేక పోవడానికి కారణాలు చూసుకుంటే. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైనికులు, ప్రజలు పోరాటం చేస్తుంది. వారి హక్కులని కాపాడుకోవడం కోసం, వారి స్వేచ్చని రక్షించుకోవడం, తమని నమ్ముకున్న వాళ్ళని బానిసలుగా మార్చాలని చూస్తున్న రష్యా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ పౌరులు కూడా సైనికులుగా మారి యుద్ధక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.
తమ కోసం నాయకుడు నిలబడ్డాడు అనే ధైర్యం ప్రజలలో ఉంటే వారి ప్రాణాలు ఇచ్చి అయిన శత్రువుపై పోరాటానికి ముందుకొస్తారు. ఇప్పుడు ఆ తెగింపు, ధైర్యం జెలన్ స్కీని చూసిన తర్వాత ఆ దేశ ప్రజలకి వచ్చింది. అందుకే తమ స్వేచ్చని రక్షించుకోవడం కోసం తామే సమిధలుగా మారుతున్నారు. రష్యాని బలంగా ఎదుర్కొంటున్నారు. కళ్ళముందు తమ వాళ్ళు చనిపోతున్న తెగించి ముందుకి దూకుతున్నారు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరిగిన ఏ యుద్ధంలో కూడా రాజు నాయకుడుగా గుర్తింపు పొందలేదు. ప్రతినాయకుడు అనే అనిపించుకున్నాడు. కురుక్షేత్రంలో కౌరవులు అయిన, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అయిన ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ని అయిన ఈ ప్రపంచం ప్రతినాయకులుగానే చూస్తుంది తప్ప ఎప్పటికి హీరోయిజం ఆపాదించదు. మన జీవితంలో కూడా ఎదుటివారితో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చిందంటే అది మనల్ని నమ్ముకున్నవాళ్ళకోసం అయ్యుండాలి తప్ప ఆధిపత్యం కోసం మాత్రం కాకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.