Shruti Haasan : సలార్ తర్వాత శృతి హాసన్ కెరీర్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారిందంటున్నారు. క్రాక్ సినిమాకి ముందు మూడేళ్ళ గ్యాప్ తీసుకుంది. కాటమరాయుడు తెలుగులో నటించిన సినిమా. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. దాంతో ఇక తెలుగులో అమ్మడి కెరీర్ ఖతం అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించనంతగా క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకుని మంచి కం బ్యాక్ ఇచ్చింది.
దాంతో ఒక్కసారిగా తెలుగులో శృతి హాసన్ బిజీ అయిపోయింది. ఒకేసారి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలకి సైన్ చేసింది. ఆ సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇప్పుడు అన్నిటికంటే భారీ చిత్రం ‘సలార్’ లో నటిస్తోంది. ఇందులో శృతిహాసన్ యాక్షన్ సీన్స్‌లో కూడా అలరించబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Salaar : శృతి హాసన్ కెరీర్ సలార్ తర్వాత ఎలా ఉండబోతుందో..?
అయితే, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన రెండు భారీ చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అంతేకాదు, ఈ రెండు సినిమాలో హీరోయిన్స్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేలకి మళ్ళీ సాలీడ్ సక్సెస్ అందలేదు. ఒకరకంగా ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్స్‌కి పెద్దగా సక్సెస్‌లు దక్కవనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడదే శృతి హాసన్ కెరీర్ సలార్ తర్వాత ఎలా ఉండబోతుందో..? అనే సందేహాలను కలగజేస్తున్నాయి.
అయితే, ప్రభాస్‌కి రెండు వరుస ఫ్లాప్స్ వచ్చిన కారణంగా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్తగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరో స్థాయికి చేరడం గ్యారెంటీ అంటున్నారు. అంతేకాదు, ఇదే సినిమాతో శృతి కెరీర్ కూడా టర్న్ అవనుందని సన్నిహిత వర్గాలు ఎంతో నమ్మకంగా చెబుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో శృతి చేస్తున్న సినిమా ఇదొక్కటే. ఇదే టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ ఎలా సాగనుందో నిర్ణయించబోతుంది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.