Tue. Jan 20th, 2026

    Shruti Haasan : సలార్ తర్వాత శృతి హాసన్ కెరీర్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారిందంటున్నారు. క్రాక్ సినిమాకి ముందు మూడేళ్ళ గ్యాప్ తీసుకుంది. కాటమరాయుడు తెలుగులో నటించిన సినిమా. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. దాంతో ఇక తెలుగులో అమ్మడి కెరీర్ ఖతం అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించనంతగా క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకుని మంచి కం బ్యాక్ ఇచ్చింది.

    దాంతో ఒక్కసారిగా తెలుగులో శృతి హాసన్ బిజీ అయిపోయింది. ఒకేసారి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలకి సైన్ చేసింది. ఆ సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇప్పుడు అన్నిటికంటే భారీ చిత్రం ‘సలార్’ లో నటిస్తోంది. ఇందులో శృతిహాసన్ యాక్షన్ సీన్స్‌లో కూడా అలరించబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    is-shruti-haasans-career-over-after-salaar
    is-shruti-haasans-career-over-after-salaar

    Salaar : శృతి హాసన్ కెరీర్ సలార్ తర్వాత ఎలా ఉండబోతుందో..?

    అయితే, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన రెండు భారీ చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అంతేకాదు, ఈ రెండు సినిమాలో హీరోయిన్స్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేలకి మళ్ళీ సాలీడ్ సక్సెస్ అందలేదు. ఒకరకంగా ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్స్‌కి పెద్దగా సక్సెస్‌లు దక్కవనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడదే శృతి హాసన్ కెరీర్ సలార్ తర్వాత ఎలా ఉండబోతుందో..? అనే సందేహాలను కలగజేస్తున్నాయి.

    అయితే, ప్రభాస్‌కి రెండు వరుస ఫ్లాప్స్ వచ్చిన కారణంగా ప్రశాంత్ నీల్ ఎంతో జాగ్రత్తగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరో స్థాయికి చేరడం గ్యారెంటీ అంటున్నారు. అంతేకాదు, ఇదే సినిమాతో శృతి కెరీర్ కూడా టర్న్ అవనుందని సన్నిహిత వర్గాలు ఎంతో నమ్మకంగా చెబుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో శృతి చేస్తున్న సినిమా ఇదొక్కటే. ఇదే టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ ఎలా సాగనుందో నిర్ణయించబోతుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.