Wed. Jan 21st, 2026

    Janasena: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఊహించని విధంగా డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో పాటు కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికలలో వచ్చిన ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని వదిలేస్తాడని అందరూ భావించారు. చిరంజీవి ప్రజారాజ్యం ప్రస్థానం ముగింపు ఎలా జరిగిందో అందరూ చూసిందే. చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా ఓటమితో రాజకీయాలలో వెనకడుగు వేస్తాడని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు.

    అయితే తరువాత అనూహ్యంగా ఏడాదిలోనే మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటానికి నాంది పలికారు. అక్కడి నుంచి తరుచుగా ఏదో ఒక అంశం మీద ప్రజలలోకి వచ్చి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతని తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత మూడు నెలల కాలం నుంచి ఏపీ రాజకీయాలలో మరింత చురుకుగా జనసేనాని దూసుకెళ్తున్నారు. జనసైనికులని కూడా సమాయత్తం చేసి నియోజకవర్గాల వారీగా పోరాటాలు చేయిస్తూ వారి బలం పెంచుకోవాలని సూచిస్తున్నారు.

    is janasena 2024 main strength from those villages

    అందుకు తగ్గట్లుగానే జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ లు కూడా వీలైనంత ఎక్కువగా ప్రజలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనసేనాని ప్రయాణం దగ్గరుండి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం ఆయనపై పెరిగిన ప్రజాదారణకి తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చాలా మీడియా ఇంటర్వ్యూలలో జనసేనకి ప్రజాదారణ పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం, కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో జనసేన పార్టీ గణనీయంగా పుంజుకుంది అనే మాట వినిపిస్తుంది.

    బలమైన నాయకులని కూడా ఆయా జిల్లాలలో నియోజకవర్గాల వారీగా జనసేనకి పెంచుకుంది. అలాగే క్యాడర్ కూడా విస్తరిస్తుంది. మరో వైపు రైతు భరోసా యాత్రతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ భాగా పెరిగింది. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయిల చొప్పున పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయం ఆ పార్టీకి పాజిటివ్ వైబ్ ని ప్రజలలో పెంచుతుంది. ఇక ఈ ఏడాది ఆఖరులో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలోకి రావడానికి చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది.

    వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది. అలాగే బలమైన సీట్లు కూడా గెలుచుకుంటుంది అనే మాట వినిపిస్తుంది. చాలా సమీకరణాలు జనసేన పార్టీకి ఈ సారి కలిసి వస్తాయనే మాట జనంలో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే అభిప్రాయం జనం ప్రజల నుంచి వస్తుంది. మరి ఇది ఎంత వరకు ఓటుగా మారి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతుంది అనేది చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.