Politics: ఏపీలో అధికార పార్టీ వైసీపీ జోరుగా తన గెలుపు గుర్రాలని సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో గెలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 ఎన్నికలలో వచ్చిన 154 సీట్లని ఇప్పుడు 175కి చేసుకోవాలని పలుమార్లు నియోజకవర్గ ఇన్ చార్జ్ ల సమావేశంలో నొక్కి మరీ చెప్పారు. ప్రతిసారి కుప్పం నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించే వారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ ప్రజల మధ్యకి గడపగడపకి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్లి సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కచ్చితంగా ఈ సారి మాత్రం అలా ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం పెంచుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉందని వారందరూ తమ పంథా మార్చుకుంటే మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తుందని, లేదంటే ఎలాంటి మొహమాటం లేకుండా తప్పిస్తానని చెప్పేశారు. ఇక జగన్ ఆ విషయం చెప్పిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళకుండా ఉన్న ఎమ్మెల్యేలు అందరిని పక్కన పెట్టడానికి ఇప్పటిజే వైసీపీ ఆయా నియోజకవర్గాల లో కొత్త ఇన్ చార్జ్ లని నియమించింది. ఇక కొత్త ఇన్ చార్జ్ లతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రావనే విషయం అర్ధమైపోయింది. దీంతో వారిలో చాలా మంది సైలెంట్ అయిపోయారు.
గతంలో ఆమె పీఆర్పీ తరుపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో వైపు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ దాదాపుగా చంద్రబాబు మీద పోటీ చేయడం ఖాయం అయిపొయింది. ఇక విశాఖలో కూడా ఎంపీగా ఈ సారి బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీకి మళ్ళీ సీటు ఇచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. అలాగే నెల్లూరులో కూడా కొంత మంది స్థానాలని మార్పు చేసే యోచనలో జగన్ ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు రాత్రికి వైసీపీలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే విషయంపై ఒక పార్టీలో క్యాడర్ కి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అలాగే అందరికి ముందస్తు ఎన్నికల గురించి కూడా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.