Beauty tips: అమ్మాయిల సౌందర్యానికి సారా ఆలీఖాన్ చెప్పిన చిట్కాలేంటో తెలుసా

Beauty tips: ఆడపిల్లలు చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. పదిమందిలో తమని తాము అందంగా రిప్రజెంట్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేయడానికి అయినా అమ్మాయిలు సిద్ధం అవుతున్నారు. కొంత మంది మేకప్ మీద డిపెండ్ అవుతారు. ఎక్కడికి వెళ్ళిన వారి వెంట మేకప్ కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ముఖ సౌందర్యం బయట వాతావరణం, దుమ్ము కారణంగా పాడవకుండా ఉండటానికి స్కార్ఫ్ లు కట్టుకుంటారు. అలాగే ఎన్నో రకాల కాస్మోటిక్స్ వాడుతారు. వారి ముఖంపై చిన్న మచ్చ కనిపించిన ఏదో పెద్ద ప్రమాదం జరిగినంతగా వారు బాధపడితూ ఉంటారు.

అలాగే కురుల సౌందర్యానికి కూడా ఆడపిల్లలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హెయిర్ కట్ ఎలా చేసుకున్న కచ్చితంగా సాఫ్ట్ గా, సిల్కీగా ఉండే విధంగా చూసుకుంటారు. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇక ఒకటే టెన్షన్ అమ్మాయిలకి స్టార్ట్ అవుతుంది. దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటారు. మెడిసన్ కూడా వాడుతూ ఉంటారు. అయితే కొంత మంది అమ్మాయిలు మాత్రం నేచురల్ గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి మేకప్ లేకుండానే సాఫ్ట్ స్కిన్ తో నిగారింపుతో కనిపించి ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే కొంత మంది కురుల సౌందర్యం కూడా బాగుంటుంది. పొడవాటి జుట్టుని మెయింటేన్ చేస్తారు. అయితే సాధారణంగా మన చర్మ సౌందర్యాన్ని, ముఖారవిందాన్ని కాపాడుకోవడానికి, అలాగే కురులని సంరక్షించుకోవడానికి ప్రత్యేకంగా కాస్మోటిక్స్ వాడాల్సిన అవసరం లేదని కొంత మంది హీరోయిన్స్ చెబుతారు వంటింట్లో దొరికే వాటితోనే ముఖారవిందం పెంచుకోవచ్చని చెబుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సారా ఆలీఖాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో తన అందానికి గల సీక్రెట్ రివీల్ చేసింది. ముఖానికి ఉల్లిపాయ పెడతానని, అలాగే కురులకి కూడా ఉల్లిపాయ పేస్టుని రాస్తానని చెప్పింది. దానికారణంగా ముఖం నిగారింపు ఉంటుందని తెలియజేసింది. ఓ సారి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి పూయడం జరిగిందని, అదే సమయంలో ముఖానికి కూడా పెట్టుకున్నా అని సారా ఆలీఖాన్ చెప్పింది. తరువాత తెలుసుకుంటే ఉల్లిపాయ రసం ఉపయోగం తెలిసిందని, అప్పటి నుంచి వినియోగించడం స్టార్ట్ చేసానని చెప్పింది.

ముఖానికి ఉల్లిపాయ పేస్ట్ ని మాస్క్ లా వినియోగించవచ్చు. దీనికోసం ఉల్లిపాయని గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసుకొని అందులో నిమ్మరసం, తేనే కలపాలి తరువాత ఆ మిశ్రమంలో శనగపిండిని కలిపి పేస్ట్ లా తయారు చేసి దానిని ముఖానికి పెట్టుకొని ఓ 20 నిమిషాల తర్వాత దానిని తీసేసి శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఈ మాస్క్ తో ముఖం నిగారింపు పెరుగుతుంది. అయితే ఇది అందరి చర్మానికి సెట్ కాదు. ఒక్కసారి చెక్ చేసుకొని కచ్చితంగా పడుతుంది అంటేనే వినియోగించాలి అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.