Pregnancy women: కడుపుతో ఉన్నటువంటి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తమ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తమ ఆరోగ్య విషయంలో మాత్రమే కాకుండా ఆహారపు విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి డాక్టర్లు పెద్దల సలహా తీసుకొని మరి తింటూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడికాయ తినడం మంచిది కాదు అని కొందరు భావిస్తుంటారు గుమ్మడికాయ తినడం వల్ల పలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు మరి నిజంగానే ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి మహిళలు గుమ్మడికాయ తినవచ్చా నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే..
ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడికాయను నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల గుమ్మడికాయ తినడం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్స్ ఫైబర్ ఎంతో పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదలకు కావలసినన్ని పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి.
ఇక కడుపుతో ఉన్నటువంటి వారికి కాస్త తిమ్మిరిగా ఉంటుంది కానీ ఈ గుమ్మడికాయ తినడం వల్ల అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా తేలికగా జీర్ణం అవ్వడానికి ఇందులో ఉన్నటువంటి ఫైబర్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక గుమ్మడికాయను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏ విధమైనటువంటి సందేహాలు వ్యక్తం చేయకుండా గర్భంతో ఉన్నటువంటి మహిళలు నిరభ్యంతరంగా గుమ్మడికాయను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.