Rent House: సాధారణంగా చాలామంది వారి ఉద్యోగాల రీత్యా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో తరచూ అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుంది తప్ప వారికి సొంత ఇల్లు అనేది ఉండదు అయితే ఇలా అద్దె కోసం మనం ఇల్లు మారుతున్న సమయంలో చాలామంది అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా పాలు పొంగించడం మంచిదేనా అసలు అద్దె ఇళ్లలో పాలు పొంగించడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..
మనం అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటిని శుభ్రం చేయించుకొని మంచి వారం తిథి చూసి పాలు పొంగిస్తూ ఉంటాము. అయితే ఇలా అద్దెకు ఉండే ఇండ్లలో పాలు పొంగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇలా అద్దె ఉండే ఇళ్లలో పాలు పొంగించడం వల్ల ఆ శుభ ప్రయోజనాలన్నీ ఇంటి యజమానికి వెళ్తాయే తప్ప వారికి ఏమాత్రం ఉండవట అంతే కాకుండా సొంత ఇంటి కల అనేది ఎప్పటికీ నెరవేరదని పండితులు చెబుతున్నారు.
అద్దె ఇళ్లలోకి వెళ్లాలనుకునేవారు ఆషాడం, శ్రావణం,భాద్రపదం వంటి మాసాలలో సరైన వారం తిథి చూసుకొని వెళ్తే మంచిది కానీ ఇలా పాలు పొంగించడం వారి కుటుంబానికి మంచిది కాదని చెబుతున్నారు. కానీ మనలో చాలామంది అదే ఇంట్లోకి వెళ్లిన అది తమ సొంత ఇంటిగానే భావించి ఆ ఇంట్లో తమకు అంతా మంచే జరగాలని కోరుతూ పాలు పొంగించి శుభదినమే ఆ ఇంట్లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.