Puri Jagannadh : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోకి మాస్ ఇమేజ్ కావాలంటే పూరి జగన్నాథ్ రాసుకున్న కథలో ఇమిడితే చాలు. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఆ హీరోకి మంచి మాస్ ఫ్యాన్స్‌ని ఇస్తారు. అంతకముందు ఎన్ని హిట్స్ కొట్టినా పూరి డైరెక్షన్‌లో సినిమా చేస్తే వచ్చే ఇమేజ్ దానికి నాలుగురెట్లుంటుంది. టాలీవుడ్‌లో మాత్రమే కాదు ఏ భాషలో అయినా పూరి సినిమా తీసి సక్సెస్ అందుకోగలరు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోకి కలర్ ఫుల్ కాస్టూంస్ వేపించి డాన్సులు చేయించగలరు.
పూరి రాసే డైలాగ్స్‌తో హీరోకి ఓ ఇమేజ్ దక్కిందంటే ఆ డైలాగ్స్ ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. కథ, కథనం రొటీన్ అయినప్పటికీ మేకింగ్ విషయంలో ఆయన స్టైల్ ఇంకో లెవల్ అని చెప్పాలి. కథలన్నీ ఒక్కటే. ఎవరి స్టైల్ మేకింగ్ వాడిది..దాంతోనే హిట్ కొట్టేది..అంటూ ఓ కొత్త ఫిలాసఫీని చెప్పింది పూరినే. ఇక ఆయన సినిమాలో కనిపించే హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్‌ను గ్లామర్‌గా చూపించడంలో..పూరికి ఓ స్టైల్ ఉంటుంది.
Puri Jagannadh : ఎవరూ పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నారు.
ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను వదిలింది ఇప్పటివరకూ కనిపించలేదు. బద్రి, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, ఇడియట్, పోకిరి, టెంపర్ ఇలా టైటిల్‌తోనే అందరిలో ఓ ఆసక్తిని రేకెత్తించగల దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమా ఇండస్ట్రీలో ఓ దర్శకుడు సంపాదించలేనంత డబ్బును, పేరును ఆయన సంపాదించారు. అలాగే, ఎవరూ పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నారు. అయినా ఎప్పుడూ డీలా పడలేదు. దానికి కారణం ఆయన మీద ఆయనకున్న నమ్మకమే.
15రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఇప్పటివరకూ ఒక్క పూరీనే అని అందరికీ తెలిసిందే. కానీ, అలా తీయడంతో పూరి సినిమాకి క్రేజ్ తగ్గిపోయింది. పాత చింతకాయపచ్చడి అనే మాట గతకొంతకాలంగా పూరి తీస్తున్న సినిమాలను చూసి అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనాల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. సూపర్ హిట్ అని మౌత్ టాక్ వచ్చినా థియేటర్ వరకూ వచ్చి సినిమా చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. దానికి తోడు పూరి సినిమాలు మరీ మొహం మొత్తేసినట్టు అనిపిస్తున్నాయి. ఆయన కథ ఎందుకు రాశారో…? అని కూడా సినిమా చూసి బయటకి వచ్చిన ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. అందుకే, ఇప్పుడు పూరి పక్కాగా కథ రెడీ అయ్యాకే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.