Youth: ప్రపంచంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిల వివాహ వయస్సు రాకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తారు. అలాగే అబ్బాయిలు కూడా 21 ఏళ్ళు పూర్తి కాకుండానే పెళ్లికి రెడీ అయిపోతూ ఉంటారు. అయితే మరీ చిన్న వయస్సులో వివాహాలు అంత మంచివి కావని సైన్స్ చెబుతుంది. బాల్య వివాహాల వలన ఎంతో మంది ఆడపిల్లలు గర్భధారణ సమయంలో చనిపోతున్నారు. అయినా కూడా ఇప్పటికి మూఢనమ్మకాలని బలంగా నమ్మేవారు ఆడపిల్లకి 15 ఏళ్ళు వచ్చేసాయి అంటే పెళ్లి చేసేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళు. ఈ వయస్సు దాటాక పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే భార్యాభర్తలుగా వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే తెలివి ఉంటుందని చట్టం వివాహ వయస్సు విషయంలో కొన్ని హద్దులు పెట్టింది.
అయితే హద్దులు ఇండియాలో ఎవరూ పెద్దగా పాటించడం లేదు అనేది అందరికి తెలిసిన నిజమే. ఇదిలా ఉంటే దశాబ్ద కాలంలో ఇండియాలో కూడా స్త్రీ, పురుషులలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు వారి ఆలోచనలలో కూడా చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. దీంతో జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే కోరిక, ఆశయాలు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి కూడా ఉంటున్నాయి. దానికి తగ్గట్లే మగవారితో సమానంగా ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఉన్నారు. కార్పోరేట్ కంపెనీలలో చాలా ఉద్యోగాలు ప్రత్యేకంగా అమ్మాయిల కోసం కేటాయించినవి ఉంటాయనేది అందరికి తెలిసిందే.
పెళ్లి ఖర్చుల కోసం అప్పులిచ్చే బెటర్ హాఫ్ సంస్థ యువతపై ఓ సర్వే చేసింది. 21-35 ఏళ్లలోని 2100 మంది యువత నుంచి ఒపీనియన్స్ తీసుకుంది. ఆర్ధికంగా స్థిరపడిన తర్వాత, సొంత ఖర్చులతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా 70 శాతం యువత పేర్కొన్నారు. పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకురుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని 57 శాతం మంది తెలిపారు. తక్కువ మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకొని ఖర్చు తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పడం విశేషం.
కేవలం 16 శాతం మంది మాత్రమే పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గ్రాండ్ గా చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని బట్టి యువత ఆలోచనలు తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆర్ధికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పెళ్లి ఖర్చుని తగ్గించుకొని దానిని ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలనే భావన కూడా చాలా మంది యువతలో ఉందని అర్ధం అవుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.