Politics: బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలలో కేసీఆర్ ఏం చేయగలరు…అంతటా ఆసక్తి

Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పేరుని, అలాగే జెండాని అధికారికంగా మారుస్తూ తీర్మానం చేశారు. ఇకపై తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గానే ఉంటుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి పెట్టి తెలంగాణలో రాష్ట్ర బాద్యతలని కేటీఆర్ కి అప్పగించబోతున్నారు. ఇక పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిచిన కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా తమ భవిష్యత్తు అధినేత కేటీఆర్ అని అధికారికంగా ఇప్పటికే ఒప్పుకుంటున్నారు ఇక కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడంపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో జరగబోయే ఎన్నికలలో అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన జేడీయూతో కలిసి తెలంగాణని ఆనుకొని ఉన్న కన్నడ నియోజక వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ తరుపున అభ్యర్ధులని బరిలోకి దింపబోతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల తర్వాత జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే దానికి సంబందించిన కార్యాచరణని సిద్ధం చేసి ఏపీలో బలమైన నాయకులని బీఆర్ఎస్ పార్టీ కోసం తయారు చేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ పై ఏపీలో కొన్ని ప్రాంతాలలో సానుకూలత ఉంది ఈ నేపధ్యంలో ఆ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీలు అందరూ వెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ భవిష్యత్తు లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరుపున అయిన బలమైన స్వరాన్ని వినిపించే నాయకులుగా మారాలని వారందరూ భావిస్తున్నారు. అలాగే తెలంగాణకి సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఎవరితో జత కట్టి ఎన్నికల బరిలోకి వెళతారనేది ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. ముఖ్యంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటిని ఒకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తయారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

దానికి అన్ని రాష్ట్రాలలో పర్యటించడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు కాకుండా హిందీ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడటం. ప్రజలని ఉత్తేజపరిచే ప్రసంగాలు కేసీఆర్ బలం వాటితోనే మోడీ పాలనపై వ్యతిరేకత చూపిస్తూ కాంగ్రెస్ పై నమ్మకం లేని ఓటర్లని కేసీఆర్ ఆకర్షించాలని భావిస్తున్నారు. మరి ఇది ఏ మేరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

7 days ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.