Youth: పెళ్లిపై యువత నిర్ణయం మారిపోతుంది… ఆసక్తికర సర్వే

Youth: ప్రపంచంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిల వివాహ వయస్సు రాకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తారు. అలాగే అబ్బాయిలు కూడా 21 ఏళ్ళు పూర్తి కాకుండానే పెళ్లికి రెడీ అయిపోతూ ఉంటారు. అయితే మరీ చిన్న వయస్సులో వివాహాలు అంత మంచివి కావని సైన్స్ చెబుతుంది. బాల్య వివాహాల వలన ఎంతో మంది ఆడపిల్లలు గర్భధారణ సమయంలో చనిపోతున్నారు. అయినా కూడా ఇప్పటికి మూఢనమ్మకాలని బలంగా నమ్మేవారు ఆడపిల్లకి 15 ఏళ్ళు వచ్చేసాయి అంటే పెళ్లి చేసేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళు. ఈ వయస్సు దాటాక పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే భార్యాభర్తలుగా వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే తెలివి ఉంటుందని చట్టం వివాహ వయస్సు విషయంలో కొన్ని హద్దులు పెట్టింది.

అయితే హద్దులు ఇండియాలో ఎవరూ పెద్దగా పాటించడం లేదు అనేది అందరికి తెలిసిన నిజమే. ఇదిలా ఉంటే దశాబ్ద కాలంలో ఇండియాలో కూడా స్త్రీ, పురుషులలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు వారి ఆలోచనలలో కూడా చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. దీంతో జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే కోరిక, ఆశయాలు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి కూడా ఉంటున్నాయి. దానికి తగ్గట్లే మగవారితో సమానంగా ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఉన్నారు. కార్పోరేట్ కంపెనీలలో చాలా ఉద్యోగాలు ప్రత్యేకంగా అమ్మాయిల కోసం కేటాయించినవి ఉంటాయనేది అందరికి తెలిసిందే.

ఇలా యువతరం ఆలోచన అంతా ఆర్ధిక స్వాలంబన మీదకి మళ్ళింది. ఈ నేపధ్యంలో యుక్త వయస్సులో ప్రేమ అనే ఆకర్షణకి లోనవుతున్న కూడా దాని నుంచి మరల చాలా వేగంగా బయట పడుతున్నారు. జీవితంలో తమకంటూ ఆర్ధిక లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా భర్త మీద ఆధారపడే స్థాయిలో ఉండకూడదని అమ్మాయిలు అనుకుంటే, పెళ్లి తర్వాత తల్లిదండ్రులకి బారం కాకుండా నాకంటూ కొంత ఆర్ధిక బలం పెంచుకోవాలని అబ్బాయిలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ సర్వేలో కూడా రుజువైంది.

పెళ్లి ఖర్చుల కోసం అప్పులిచ్చే బెటర్ హాఫ్ సంస్థ యువతపై ఓ సర్వే చేసింది. 21-35 ఏళ్లలోని 2100 మంది యువత నుంచి ఒపీనియన్స్ తీసుకుంది. ఆర్ధికంగా స్థిరపడిన తర్వాత, సొంత ఖర్చులతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా 70 శాతం యువత పేర్కొన్నారు. పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకురుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని 57 శాతం మంది తెలిపారు. తక్కువ మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకొని ఖర్చు తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పడం విశేషం.

కేవలం 16 శాతం మంది మాత్రమే పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గ్రాండ్ గా చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని బట్టి యువత ఆలోచనలు తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆర్ధికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పెళ్లి ఖర్చుని తగ్గించుకొని దానిని ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలనే భావన కూడా చాలా మంది యువతలో ఉందని అర్ధం అవుతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.