Shami plant: సాధారణంగా మనం మన ఇంటి ఆవరణంలో కొన్ని రకాల మొక్కలను నాటుతూ ఉంటాము. ఇలా మన ఇంటి ఆవరణంలో కొన్ని ఆధ్యాత్మిక మొక్కలను కూడా పెంచుతూ ఉంటాము. ఇలాంటి ఆధ్యాత్మిక మొక్కలలో తులసి మనీ ప్లాంట్ వంటి వాటిని పెంచుతూ ఉంటాము అయితే ఇవి కాకుండా మరికొన్ని ఆధ్యాత్మిక మొక్కలను కూడా నాటుతూ ఉంటాం. అలాంటి వాటిలో శమీ వృక్షం ఒకటి.
మన ఇంటి ఐశ్వర్యం పెరగాలంటే..శ్రావణ శనివారం మీ ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కను నాటాలని నిపుణులు చెబుతున్నారు. అది మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని అంటున్నారు. శనివారం నాడు నాటినట్టయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే శని సడేశాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని దోశం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది.మీ ఆవరణలో ఈ శమీ మొక్కను నాటితే, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.
ఇక ఈ మొక్కను శనివారం నాటడం ఎంతో మంచిది.అలాగే ప్రతిరోజు ఉదయం శమీ మొక్కకు నీళ్లు పోయాలి. సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఇలా ఈ వృక్షాన్ని నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు గ్రహ జాతక దోషాలను కూడా తొలగించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మొక్క చుట్టు పరిసర ప్రాంతాలు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పులు, చెత్త బుట్టను ఈ మొక్క పక్కన పెట్టకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చెట్టును పూజించటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.