Ileana : ఇలియానా..బెల్లీ డాన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఒకప్పుడు. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో అమ్మడు ఒకదశలో స్టార్ హీరోలకి సైతం డేట్స్ సర్దుబాటుచేయలేనంత బిజీగా సినిమాలు చేసింది. దేవదాసు, పోకిరి ఇలియానాకి ఏకంగా కోటి రూపాల హీరోయిన్ను చేశాయి. బక్కపలచని పర్సనాలిటీతో ఉన్నప్పటికీ బెల్లీ డాన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. దర్శకనిర్మాతలకి హీరోలకి అణువుగా ఉండటంతో వరుసగా అవకాశాలిచ్చారు.
అయితే సక్సెస్ ఫుల్‌గా సాగ్గ్తున్న కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుంది. టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడటం అదే సమయంలో మంచి కథలపై దృష్టిపెట్టకపోవడంతో కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా ఆ తర్వాత కాలంలో అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. మన టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్స్‌కి వాళ్ళ వయసుకు తగ్గ హీరోయిన్ ఇప్పుడు దొరకడం లేదు.
ఇలియానా అంటే ఈ ఈ హీరోలందరికీ బాగా సూటయ్యే పర్సనాలిటీ. ఏ రకంగా చూసిన సీనియర్ హీరోల పక్కన వంకపెట్టడానికి వీలులేని హీరోయిన్. కానీ, ఎందుకనో ఎవరూ మన ఇల్లీబేబీని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండుసార్లు టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ఫ్లాపయింది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా సినిమా అవకాశాలు అందుకుంటోంది. సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటోంది. మరి మన టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా ఇలియానావైపు ఓ చూపు చూస్తే మళ్ళీ మనం బెల్లీ డాన్స్ చూడొచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.