Mushrooms: మనలో చాలామంది పుట్టగొడుగులు తినడానికి ఇష్టపడకపోగా ఏవేవో కారణాలు చెబుతుంటారు. పుట్టగొడుగులు తింటే శరీర బరువు పెరుగుతుందని, అలర్జీలు తలెత్తి చర్మ సమస్యలు వస్తాయని రకరకాల కారణాలు చెబుతుంటారు. ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే ఇప్పుడు చెప్పబోయే పుట్టగొడుగుల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పుట్టగొడుగుల్లో అత్యధికంగా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు శాకాహారుల్లో పోషకాహార లోపాన్ని తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పుట్టగొడుగులు తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఉబకాయం, అధిక శరీర బరువు, రక్త పోటు వంటి సమస్యలతో బాధపడేవారు వారంలో ఒకటి లేదా రెండుసార్లు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవడమే కాకుండా ఉబకాయం, రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి. మష్రూమ్స్ లో అధికంగా ఉండే పీచు పదార్థం, యాంటీ బయోటిన్ గుణాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతాయి. ఎముకల ,కండరాల దృఢత్వానికి సహాయపడి కీళ్ల నొప్పులు, కండరాల వాపును తగ్గిస్తుంది.
పుట్టగొడుగులు అత్యధికంగా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి కావున రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడతాయి. పుట్టగొడుగులు ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు, అమైనో ఆమ్లాల ఒంట్లో క్యాన్సర్ కణాలను నియంత్రిస్తాయి మరియు రక్తనాళాలను శుభ్రం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పచ్చకామెర్ల వ్యాధిని నియంత్రించడంలో పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.