Anemia: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఇలాంటి ఇబ్బందులు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వెంటాడే పరిస్థితి ఏర్పడతాయి. రక్తహీనత సమస్యకు సరైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆహార పదార్థాలతో పాటు రెండు వారాలపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగటం వల్ల రక్తం భారీ స్థాయిలో పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జ్యూస్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…
రక్తం వృద్ధి చెందడానికి దానిమ్మ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. దానిమ్మ పండును తీసుకొని గింజలు మొత్తం బయటకు తీయాలి ఇలా బయటకు తీసిన ఈ గింజలతో పాటు గ్రీన్ ఆపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఒక రోజు రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి మరుసటి రోజు డ్రై అంజూరతో పాటు, ఆరెంజ్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగాలి. ప్రతిరోజు తప్పకుండా ఒక గ్లాస్ తాగటం వల్ల రక్తం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.
ఇలా రెండు వారాలపాటు ఈ జ్యూస్ తాగటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కూడా ఉంటాము ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇదొక అద్భుతమైన ఔషధం అని చెప్పాలి. ఇక ఈ జ్యూస్ ప్రతి ఒక్కరు తాగడం వల్ల రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు ఏ విధమైనటువంటి అలసట నీరసం అనేవి మన దరిదాపుల్లోకి రావు అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించడంలో ఈ జ్యూస్ ఎంతగానో దోహదం చేస్తుంది.