Devotional Tips: మన హిందూ పురాణాల ప్రకారం రావి చెట్టుకు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఈ రావి చెట్టులో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. ముఖ్యంగా రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారని రావి ఆకులలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టును ఆధ్యాత్మిక వృక్షంగా భావించి పూజిస్తారు.
ఇకపోతే ఈ రావి చెట్టుకు ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది ఆయుర్వేదం ప్రకారం రావి ఆకులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎన్నో రకాల రోగాల నుంచి మనల్ని కాపాడటానికి కీలకపాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఆధ్యాత్మికపరంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారికి రావి ఆకులతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
ప్రతి శనివారం రావి చెట్టు ముందు నెయ్యితో దీపారాధన చేయటం ఎంతో ముఖ్యం ఇలా శనివారం నెయ్యితో దీపారాధన చేయడం వల్ల శని ప్రభావ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా రావి ఆకులను ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే సమయంలో దిండు కింద పెట్టుకొని పడుకోవటం వల్ల వారి అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు.