Vitamin D: సాధారణంగా మన శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ లలో విటమిన్ డి ఒకటి ఈ విటమిన్ టి కారణంగా శరీరంలో ఎముకలు దృఢత్వానికి ఎంతో దోహదం చేస్తుంది. అందుకే విటమిన్ తప్పనిసరిగా మన శరీరానికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్ డి కారణంగా ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోకుండా దృఢంగా ఉంటాయి. విటమిన్ డి వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు సూర్యరష్మి నుంచి వెలబడుతుంది. అందుకే ఏం సమయంలో సూర్య కిరణాలు మనపై పడేలా ఉంటే తప్పనిసరిగా విటమిన్ డి మన శరీరానికి అందుతుంది.
ఇలా చాలామంది విటమిన్ డి సమస్యతో బాధపడేవారు ఆహార పదార్థాల పాటు సప్లిమెంటరీ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే విటమిన్ ఇలా సప్లిమెంటరీ రూపంలో తీసుకునేవారు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి మన శరీరానికి మోతాదుకు మించి విటమిన్-డి తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందుకే సరైన మోతాదులో మాత్రమే మనం విటమిన్ డి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మనం మన శరీరానికి ఎంత మోతాదులో విటమిన్ డి ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయానికి వస్తే..
మన శరీరంలో 30 నుండి 60 ఎన్ జి/ ఎమ్ ఎల్ మోతాదులో విటమిన్ డి స్థాయిలు ఉండాలి. విటమిన్ డి స్థాయిలు ఇంత కంటే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు ఎక్కువవుతాయి. క్యాల్షియం గ్రహించడంలో విటమిన్ డి మనకు దోహదపడుతుంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలో పెరగటం వల్ల తలతిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం, హైబీపీ, పిండాలలో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే వివిధ రకాల మానసిక రుగ్మతలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే విటమిన్ డి సప్లిమెంటరీ రూపంలో తీసుకునేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకుని తీసుకోవడం ఎంతో మంచిది.