Spirtual: సనాతన హిందూ ధర్మంలో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. వీటి వెనుక శాస్త్ర సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి. మహర్షులు ముందుగానే ఊహించి సనాతన హిందూ ధర్మంలో ఈ ఆచార వ్యవహారాలను, ధర్మ సంబంధ విషయాలను గ్రంథస్తం చేశారు. వీటిని ఆచరిస్తే మానవ జీవితం సుఖమయంగా ఉంటుందని, కుటుంబ బంధాలు నిలబడతాయని, జీవితం సంతోషం నడుస్తుందని చెబుతారు. అయితే ఈ కాలంలో చాలామంది ఈ ఆచార వ్యవహారాలను పెద్దగా విశ్వసించరు. అవన్నీ కూడా ఒక మూఢ విశ్వాసాలుగా కొట్టిపారేస్తారు.
కాలమాన పరిస్థితులు తగ్గట్టు మన ఆలోచనలు, ఆచారాలు మార్చుకోవాలని చాలామంది అంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది మహర్షులు చెప్పిన మంచి విషయాలను పక్కనపెట్టి తమకు నచ్చిన మార్గంలో ప్రయాణించి కష్టాలను కొని తెచ్చుకుంటారు. ఇదిలా ఉంటే మన గ్రంథాలలో, చరిత్రలో చాణిక్యుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చాణిక్య నీతి పేరుతో అతను రాసిన గ్రంథంలో ఎన్నో విషయాలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. అలాగే మనుషుల స్వభావాలను కూడా అందులో చాణిక్యుడు పొందుపరిచారు.
ఆ స్వభావాలను అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకుంటే సరైన మార్గంలో మానవ జీవితం నడుస్తుందని చాణిక్యుడు అందులో పేర్కొన్నాడు. ఒక మగాడు జీవితంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ వచ్చే స్త్రీ స్వభావం బట్టి ఆ కుటుంబంలో మంచి, చెడు ఆధారపడి ఉంటుందని చాణిక్య నీతిలో చెప్పబడింది. ఇలాంటి గుణాలు ఉన్న స్త్రీలు కుటుంబానికి అదృష్టవంతులుగా మారుతారు అని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు.
సహనశక్తి ఉన్న స్త్రీలు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు. అలాంటి సహన స్వభావం ఉన్న స్త్రీలను కుటుంబంలోకి ఆహ్వానిస్తే మంచిది. అలాగే ధర్మ మార్గంలో నడిచే స్త్రీలు ఎలాంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అలాంటి స్త్రీలు కుటుంబంలో ఉంటే భవిష్యత్ తరాలకు మంచి విలువలు నేర్పిస్తారని చాణిక్య నీతి చెబుతుంది. ప్రశాంత స్వభావం ఉన్న స్త్రీలు వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరితో అయినా తమ అభిప్రాయాలను చాలా క్లియర్ గా వ్యక్తం చేస్తారు. ఇలాంటి స్త్రీలు కుటుంబంలో ఉంటే జీవితం సరైన మార్గంలో వెళ్తుంది. అలాగే మృదువుగా మాట్లాడే స్త్రీలు ఉంటే ఎంత కోపంలో ఉన్న వారినైనా కూడా ప్రశాంత స్థితికి తీసుకువస్తారు. ఇలాంటి వారు ఎన్ని వివాదాలనైన చాలా సులభంగా పరిష్కరిస్తారు. ఈ అయిదు స్వభావాలు ఉన్న స్త్రీలు కుటుంబాలు ఉంటే మంచిదని చెబుతోంది.