Wed. Jan 21st, 2026

    Keerthy Suresh : కీర్తి సురేష్..పర్ఫార్మెన్స్ పరంగా గొప్ప నటి అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రం ఇంకా నిలబడలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. చేయడానికి తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. మధ్యలో తన పెళ్లికి సంబంధించిన రూమర్స్ చాలా వచ్చినా కూడా వాటిని కాస్త పట్టించుకోలేదు. స్వయంగా తన తల్లిదండ్రులతోనే రూమర్స్‌కి క్లారిటీ ఇచ్చింది.

    If Keerthy Suresh doesn't change his ways, will there be problems..?
    If Keerthy Suresh doesn’t change his ways, will there be problems..?

    ఇక సినిమాల ఎంపిక విషయంలోనూ కీర్తికి చాలామంది ఎన్నో సలహాలిస్తున్నారు. మహానటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కీర్తి అవార్డులను అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఒకటంటే ఒక్కటి కూడా హిట్ అందుకోలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపువుతుంటే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు.

    Keerthy Suresh : రెమ్యునరేషన్ విషయంలో కీర్తి అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు.

    అసలే హీరోయిన్స్ మధ్య పోటీ గట్టిగా ఉంది. సక్సెస్‌లలో లేని హీరోయిన్ డిమాండ్ చేస్తుందీ అంటే దర్శకనిర్మాతలు నెమ్మదిగా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కీర్తిని టాలీవుడ్ మేకర్స్ పక్కన పెట్టేసినట్టే అనుకుంటున్నారు. ఎప్పుడో కమిటైన భోళా శంకర్, దసరా సినిమాలు తప్ప కొత్తవి ఏవీ అమ్మడు సైన్ చేయలేదట. ఒకవేళ తనవరకూ ఏదైనా అవకాశం వచ్చినా కూడా హీరో పెద్ద స్టార్ అయితేనే ఒప్పుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ధోరణిలోనే ఉంటే కీర్తిని మెల్లగా జనాలు మర్చిపోవాల్సిందే.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.