pitru paksham: భాద్రపద మాసంలోని ‘శుక్లపక్షం’ దేవతా పూజలకు ఎంత విశిష్టమైనది. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులను పితృపక్షాలు అని పిలుస్తారు. ఈ ఏడాది పితృపక్షాలు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు ఉంటాయి అయితే ఈ 15 రోజుల కాలంలో పితృదేవతలకు మనం తర్పణం వదలడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు వారి దీవెనలు మనపై ఉంటాయి. అలాగే పితృ దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తుంటారు. అందుకే ఈ పితృపక్షంలో చాలామంది దానధర్మాలు చేయడం అనాధలకు కొత్త బట్టలను ఇవ్వడం అలాగే, పితృదేవతలకు పిండప్రదానం చేయడం వంటివి చేస్తుంటారు.
ఇకపోతే పితృపక్షంలో కనుక మన ఇంట్లో చిన్నారులు జన్మిస్తే అది మంచిదేనా ఒకవేళ జన్మిస్తే ఏ విధమైనటువంటి లక్షణాలతో ఉంటారు ఏంటి అనే విషయానికి వస్తే… పితృ పక్షంలో పిల్లలు జన్మించడం ఎంతో శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఈ పితృపక్షంలో పిల్లలు కనక మన ఇంట్లో జన్మిస్తే వారు పూర్వీకుల ఆశీర్వాదంతోనే జన్మించారని అర్థం. వారికి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది.
ఈ పిల్లలకు పూర్వీకుల లక్షణాలు, పోలికలు కూడా ఉంటాయి. పితృ పక్షంలో పుట్టిన పిల్లలు క్రియేటివ్ గా ఉంటారు. సమాజంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఈ పిల్లలు కుటుంబానికి కూడా అదృష్టాన్ని పంచుతారు. పిల్లలు వంశానికి మూలకారకులు కూడా అవుతారని భావిస్తారు. ఇక పితృపక్షంలో ఎవరైతే జన్మిస్తారో ఆ పిల్లల జాతకం జన్మ కుండలిలో చంద్రుని స్థానం చాలా బలహీనంగా ఉంటుంది. పితృపక్షంలో జన్మించే పిల్లలు చాలా అదృష్టవంతులుగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.